వై.ఎస్ విజయమ్మతో టీవీ9 స్పెషల్ ఇంటర్వ్యూ

|

Apr 06, 2019 | 9:33 PM

కడప: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్న  వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షురాలు వై.ఎస్ విజయమ్మ టీవీ9కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన, పార్టీ హామీల వంటి పలు అంశాలపై స్పందించారు. జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి… సీఎంగా జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని విజయమ్మ అన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజలు నమ్మకం కోల్పోయారని.. 2014 ఎన్నికల్లో […]

వై.ఎస్ విజయమ్మతో టీవీ9 స్పెషల్ ఇంటర్వ్యూ
Follow us on

కడప: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్న  వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షురాలు వై.ఎస్ విజయమ్మ టీవీ9కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన, పార్టీ హామీల వంటి పలు అంశాలపై స్పందించారు.

జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి… సీఎంగా జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని విజయమ్మ అన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజలు నమ్మకం కోల్పోయారని.. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చారని ఆమె అన్నారు. ఇప్పుడు చంద్రబాబు మీద ప్రజలకు నమ్మకం లేదని.. ఒక్కసారి జగన్ కు అధికారం ఇవ్వాలని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఏ హామీని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదని.. వైఎస్ఆర్‌ పాలనకు, చంద్రబాబు పాలనకు పోలికే లేదని ఆమె అన్నారు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు మాట మీద నిలబడి చెప్పినవన్నీ చేశారని ఆమె తెలిపారు.

జగన్ కు ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని అంటున్న చంద్రబాబు తన మనసాక్షిని ఒక్కసారి ప్రశ్నించుకోవాలన్నారు. భగవంతుడు ఆయనకు ఇచ్చిన 14 సంవత్సరాల అధికారంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చెయ్యలేదని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులు కరువే ఉందని ఆమె మండిపడ్డారు.

జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు మీరు ఎలా స్పందిస్తారు.?

రాష్ట్రంలో ఎవరైనా అరాచకవాది ఉన్నారంటే అది కేవలం చంద్రబాబే అని విజయమ్మ తెలిపారు. అంతేకాకుండా వైఎస్ రాజారెడ్డి హంతకులకు కూడా ఆశ్రయం కల్పించింది చంద్రబాబే అని ఆమె ఆరోపించారు.

కేసీఆర్‌కు ఏపీతో సంబంధం ఏమి లేదు

కేసీఆర్‌కు ఏపీతో ఎటువంటి సంబంధం లేదని విజయమ్మ తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో జగన్ కలిసి పోటీ చెయ్యట్లేదని.. చంద్రబాబే అన్ని పార్టీలు మారతారని.. మొన్నటివరకు బీజేపీతో కలిసి, తాజాగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడని ఆమె గుర్తు చేశారు. కేసీఆర్ కేవలం ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం వాళ్ళ ఎంపీలతో సపోర్ట్ చేస్తానని చెప్పడం వల్లే జగన్ స్వాగతించాడని ఆమె తెలిపారు.

మా పార్టీ వల్ల టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరగట్లేదని.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో లేనప్పుడు మరోలా మాట్లాడతారని విజయమ్మ ఆరోపించారు.