అనంతపురం జిల్లా మడకశిర మండలం తురకవాండ్లపల్లి విలేజ్‌లో 5 నెలల క్రితం జరిగిన మహిళ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. విచారణ అనంతరం నిందితుడిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
మండలంలోని తురకవాండ్లపల్లి గ్రామ దగ్గర్లో వద్ద 5 నెలల క్రితం కాలిన స్థితిలో గుర్తు తెలియని మహిళ డెడ్‌బాడీ లభ్యమైంది. ఈ ఘటనపై మడకశిర పోలీసులు దర్యాప్తు చేశారు. పూర్తి విచారణ అనంతరం నేడు కర్ణాటక రాష్ట్రం నేరళ్లకుంట గ్రామంలో నిందితుడు రామప్పను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న టూ వీలర్, బంగారు, వెండి నగలు, సెల్ ఫోన్లు, చనిపోయిన మహిళ బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన రామప్ప ఎం.ఏ. హిస్టరీ, ఎంఫిల్ పూర్తి చేశాడు. గతంలో బెంగళూరు సిటీలోని ఓ కాలేజ్‌లోని వర్క్ చేశాడు. అక్కడ ఉద్యోగం పోవటంతో అనంతరం శ్రీ రవిశంకర్ విద్యా మందిర్ ఆయుర్వేదిక్ కళాశాల & ఆసుపత్రిలో జాబ్ చేశాడు. అదే ఆస్పత్రిలో పని చేస్తున్న వసంతమ్మ అనే మహిళతో అతనికి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చెడు వ్యసనాలకు బానిసవ్వడంతో అతడు డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టాడు. ఈ క్రమంలో తనకు డబ్బు అవసరం ఉందని వసంతమ్మ దగ్గర 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఎన్ని రోజులు గడిచినా వాటిని తిరిగి ఇవ్వకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వసంతమ్మ వార్నింగ్ ఇచ్చింది.
దీంతో డబ్బులు ఇస్తానని పిలిచి ఆమెను చంపేయాలని ప్లాన్ చేశాడు. వసంతమ్మను మడకశిర రప్పించి, తురకవాండ్లపల్లి మారమ్మ దేవస్థానంలో రాత్రంతా ఉన్నారు. అర్ధరాత్రి వసంతమ్మ నిద్రలో ఉండగా గొంతు పిసికి చంపేశాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలు, మొబైల్ ఫోన్, బ్యాంక్ ఖాతా పాస్ బుక్ తీసుకున్నాడు. ఆమె డెడ్‌బాడీపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడినుంచి పారిపోయాడు. కర్ణాటకలో మహిళ మిస్సింగ్ కేసు నమోదైందని తెలుసుకున్న మడకశిర పోలీసులు… ఆ దిశగా దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు.
Also Read :