బంగారం ధ‌ర త‌గ్గిందండోయ్, వెండి మాత్రం కొండెక్కింది

మొన్న‌టివ‌ర‌కు కొండెక్కిన ప‌సిడి ధర శుక్రవారం స్వల్పంగా రూ.94 తగ్గింది. దీనితో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రామ్స్ స్వ‌చ్చమైన గోల్డ్ రూ.52,990 వద్దకు చేరింది.

బంగారం ధ‌ర త‌గ్గిందండోయ్, వెండి మాత్రం కొండెక్కింది
Follow us

|

Updated on: Aug 21, 2020 | 7:09 PM

మొన్న‌టివ‌ర‌కు కొండెక్కిన ప‌సిడి ధర శుక్రవారం స్వల్పంగా రూ.94 తగ్గింది. దీనితో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రామ్స్ స్వ‌చ్చమైన గోల్డ్ రూ.52,990 వద్దకు చేరింది. ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్‌లో పసిడి ధరలు తగ్గడం వల్ల ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌పై ప‌డ్డ‌ట్లు నిపుణులు చెప్తున్నారు. వెండి ధర మాత్రం శుక్రవారం భారీగా కిలోకు రూ.782 పెరిగింది. ప్ర‌స్తుతం కేజీ వెండి ధర రూ.69,262 వద్ద ఉంది. నాణేపు తయారీదారులు, పరిశ్రమ యూనిట్ల నుంచి డిమాండ్ పెర‌గ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణంగా చెప్పు‌కోవ‌చ్చు. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,938 డాలర్లకు దిగొచ్చింది. వెండి ఔన్సుకు 27.19 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇకపోతే బంగారం ధరపై చాలా అంశాలు ఎఫెక్ట్ చూపుతాయి. గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరల‌ను ప్రభావితం చేస్తాయి.

Also Read : సీమ ఎత్తిపోతలపై తెలంగాణ వాదన వినేందుకు ఎన్​జీటీ సమ్మ‌తి