ఫ్లోరిడాలో పెను గాలులు.. గాల్లో తేలియాడిన కార్మికులు

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విచిత్రం జరిగింది. గత నెల 30 న మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఉక్కపోతతో అల్లాడారు జనం.  వాతావరణం బాగుండడంతో ఎత్తయిన ఓ భవనం బయటి కిటికీలను శుభ్రపరచేందుకు రెడీ అయ్యారు ఇద్దరు కార్మికులు. పొడవాటి స్టీల్ ప్లాట్ ఫామ్ వంటి దానిపై ఎక్కి అది గాల్లో తేలుతుండగా కిటికీల అద్దాలు తుడవబోయేలోగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పెను గాలులతో తుపాను లాంటి వెదర్ వారిని భయపెట్టింది. గంటకు సుమారు 50 కి.మీ. […]

ఫ్లోరిడాలో పెను గాలులు.. గాల్లో తేలియాడిన కార్మికులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 02, 2020 | 7:55 PM

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విచిత్రం జరిగింది. గత నెల 30 న మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఉక్కపోతతో అల్లాడారు జనం.  వాతావరణం బాగుండడంతో ఎత్తయిన ఓ భవనం బయటి కిటికీలను శుభ్రపరచేందుకు రెడీ అయ్యారు ఇద్దరు కార్మికులు. పొడవాటి స్టీల్ ప్లాట్ ఫామ్ వంటి దానిపై ఎక్కి అది గాల్లో తేలుతుండగా కిటికీల అద్దాలు తుడవబోయేలోగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పెను గాలులతో తుపాను లాంటి వెదర్ వారిని భయపెట్టింది. గంటకు సుమారు 50 కి.మీ. వేగంతో వీచిన గాలులకు వారు  ఎక్కిన స్టీల్ ప్లాట్ ఫామ్ చిగురుటాకులా అటూఇటూ ఊగిపోయింది. సుమారు 20 నిముషాలసేపు అలా గాల్లో తేలుతూ ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉండిపోయారు. గాలులు కాస్త శాంతించిన తరువాత ఓ బాల్కనీ గోడను పట్టుకుని తమను తాము రక్షించుకున్నారు. మరి కొద్దిసేపు అదే పరిస్థితి ఉంటే పట్టు తప్పి ఎత్తు నుంచి కింద పడిపోయి ప్రాణాలు పోగొట్టుకుని ఉండేవారమని అంటున్నారు వాళ్ళు. తమ జీవితంలో ఇంతటి ఆపదను ఎప్పుడూ ఎదుర్కోలేదట ఆ కార్మికులు ! ఇది తమకు పునర్జన్మే అంటున్నారు.

ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం