అవసరమైతే నేనే శ్రీనగర్ వెళ్తా..’ సుప్రీం ‘ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్

జమ్మూ కాశ్మీర్ అంశం కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మధ్య అగాధం సృష్టించేట్టు కనిపిస్తోంది. కాశ్మీర్ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల అత్యున్నత న్యాయస్థానం పరోక్షంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న దాఖలాలు కనబడుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో కేంద్రం విధించిన ఆంక్షలను కోర్టు తప్పు పడుతోందా అన్న అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే తానే శ్రీనగర్ వెళ్తానని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సంచలన ప్రకటన చేశారు. ఆగస్టు 5 నుంచి […]

అవసరమైతే నేనే శ్రీనగర్ వెళ్తా..' సుప్రీం ' చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Sep 16, 2019 | 4:27 PM

జమ్మూ కాశ్మీర్ అంశం కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మధ్య అగాధం సృష్టించేట్టు కనిపిస్తోంది. కాశ్మీర్ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల అత్యున్నత న్యాయస్థానం పరోక్షంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న దాఖలాలు కనబడుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో కేంద్రం విధించిన ఆంక్షలను కోర్టు తప్పు పడుతోందా అన్న అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే తానే శ్రీనగర్ వెళ్తానని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సంచలన ప్రకటన చేశారు. ఆగస్టు 5 నుంచి కాశ్మీర్లో అత్యంత కఠినమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయని, అందువల్ల ఆ రాష్ట్ర హైకోర్టు అక్కడి పరిస్థితులను అంచనా వేయలేకపోతోందని బాలల హక్కుల నేత మీనాక్షి గంగూలీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ గొగోయ్ ఈ వ్యాఖ్య చేశారు. కాశ్మీర్లోని ఆంక్షల ఫలితంగా 6 నుంచి 18 ఏళ్ళ మధ్యవయస్సువారు అక్కడికి వెళ్లలేకపోతున్నారని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు మీరు అక్కడికి వెళ్ళవచ్చునని చీఫ్ జస్టిస్ అన్నారు. మీరు ఆ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లడంలో ఇబ్బంది ఏముందని, ఇందుకు ఎవరు అడ్డొస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అవసరమైతే జమ్మూకాశ్మీర్ హైకోర్టుకు నేనే వెళ్తా అని కూడా ఆయన అన్నారు. హైకోర్టును ఆశ్రయించలేకపోతున్నామన్నది అత్యంత సీరియస్ విషయమని, తానే స్వయంగా శ్రీనగర్ వెళ్తానని జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. అసలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓ నివేదిక సమర్పించాలని ఆయన సూచించారు. ఈ రిపోర్టు అందాక ఆ రాష్ట్రాన్ని సందర్శిస్తానని ఆయన చెప్పారు ఆ రిపోర్టు మీరు చెబుతున్న అంశాలకు భిన్నంగా ఉన్నట్టయితే జరిగే పరిణామాలను ఎదుర్కోవడానికి సిధ్దంగా ఉండండి అని పిటిషనర్ ను హెచ్ఛరించారు. .