పవన్ కల్యాణ్‌పైనే సముద్రమంత ఆశ… ఉప్పాడ గ్రామం గుండె కోతను తీరుస్తారని …!

ఇప్పటి వరకు ఆ ఊరి కథను.. చెప్పని పేపరు లేదు... చూపించని టీవీ లేదు... వైరల్ చెయ్యని సోషల్ మీడియా లేదు... బట్ ఏం లాభం... ఇప్పటి వరకు ఆ ఊరి సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు.

పవన్ కల్యాణ్‌పైనే సముద్రమంత ఆశ... ఉప్పాడ గ్రామం గుండె కోతను తీరుస్తారని ...!
Uppada the sinking village

Edited By: Ravi Panangapalli

Updated on: Jul 15, 2024 | 1:13 PM

8 గ్రామాలు…1365 ఎకరాలు.. నిన్న మొన్నటి వరకు కళ్ల ముందే కనిపించేవి. కానీ ఇవాళ లేవు. ఇప్పుడున్న ఊళ్లు రేపు ఉంటాయో.. లేదో కూడా అనుమానమే. ప్రభుత్వాలు చేస్తున్న అరకొర ప్రయత్నాలు.. అసంపూర్ణ ఆలోచనలు.. ఆ ఊళ్లను.. ఊళ్లోని జనాలను, వారి ఆస్తుల్ని  ఇప్పటి వరకు ఏ మాత్రం ఆదుకోలేకపోయాయి. సముద్రపు అలల ధాటికి ఊళ్లు కొట్టుకుపోతుంటే .. ఆ జనం కన్నీళ్లు కూడా అందులో కలిసిపోతున్నాయి. వారి ఘోష… సముద్రపు ఘోషలో కలిసిపోయి… ఇన్నాళ్లూ పాలకులకు వినిపించకుండా పోయింది. ఎస్.. మనం మాట్లాడుకుంటున్న ఊరు ఉప్పాడ. శాశ్వత పరిష్కారం ఎప్పుడు? ఎలా ఉండాలి..? ఎలా ఉంది..? ఇప్పటి వరకు ఆ ఊరి కథను.. చెప్పని పేపరు లేదు… చూపించని టీవీ లేదు… వైరల్ చెయ్యని సోషల్ మీడియా లేదు… బట్ ఏం లాభం… ఇప్పటి వరకు ఆ ఊరి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదు. అందమైన చీరలపై అలవోకగా జాంధానీ డిజైన్లు అద్దే చేతులు… ఓ వైపు మనోహరమైన సముద్రపు అలల సవ్వడి… ఎటు చూసినా పచ్చదనం… నిజానికి ఆ ఊరి దృశ్యాలు ప్రకృతి గీసిన చిత్రంలా ఉండాలి. ఒకప్పుడు ఉండేది కూడా. కానీ గడిచిన 6 దశాబ్దాలుగా వారి రాత రోజు రోజుకీ మారిపోతోంది. ఎగసి పడే ప్రతి అల.. తమను, తమ ఇళ్లను, తమ ఊరిని మింగేస్తుంటే… తమ బాధ ప్రభుత్వాల ముందు కంఠ శోషగానే మిగిలిపోతూ ఉంటే.. దిక్కు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి