అపార్ట్‌మెంట్ వాసుల షాకింగ్ డెసిషన్.. కొత్తగా ఎవరైనా వస్తే.. అన్నీ కట్..

| Edited By:

May 11, 2020 | 12:33 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడు, ఎవరికి ఎలా సోకుతుందోనన్న ఆందోళనలో జనం ఉన్నారు.

అపార్ట్‌మెంట్ వాసుల షాకింగ్ డెసిషన్.. కొత్తగా ఎవరైనా వస్తే.. అన్నీ కట్..
Follow us on

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడు, ఎవరికి ఎలా సోకుతుందోనన్న ఆందోళనలో జనం ఉన్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో ఉన్న అపార్ట్ మెంట్స్ ఓనర్స్ అసోషియేషన్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అపార్ట్‌మెంట్ వాసులు కొత్తగా ఎవరినీ లోనికి అనుమతించరాదని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు.. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే రూ.11వేల జరిమానా ఉంటుందని హెచ్చరించింది. అంతేగాక వాటర్, కరెంట్ కనెక్షన్లు కట్ అవుతాయని పేర్కొంది. ఇప్పటికే స్థానిక రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని మూడు సొసైటీలు కంటైన్మెంట్‌లోకి వెళ్లడంతో తాజా నిర్ణయాలు తీసుకున్నట్టు అసోషియేషన్ తెలిపింది. బయటవారిని లోనికి తీసుకురావొద్దని.. నిబంధనలను అతిక్రమిస్తే లీగల్ నోటీసులను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నారు.

కాగా.. ఈ నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే మెజార్టీని దృష్టిలో పెట్టుకోవాలని అంటున్నారు. దీనిపై అసోషియేషన్ సభ్యులు స్పందిస్తూ… నిబంధనలు అతిక్రమించి రోడ్డుపై వచ్చిన వారికి పోలీసులు చలాన్లు వేస్తున్నారని.. అలాగే తాము కూడా అని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.