Viral video : క్షణకాలంలో పెను ప్రమాదం నుంచి బయట పడిన భార్యాభర్తలు..

|

Apr 02, 2021 | 6:54 PM

ప్రమాదం ఎప్పుడు ఎలా జరుగుతుందో  ఎవ్వరం చెప్పలేం..ఊహించని ప్రమాదాలు మన చుటూ ఎన్నో ఉంటాయి. జాగ్రత్త పడకపోతే ఇక అంతే..

Viral video : క్షణకాలంలో పెను ప్రమాదం నుంచి బయట పడిన భార్యాభర్తలు..
Viral Video
Follow us on

ప్రమాదం ఎప్పుడు ఎలా జరుగుతుందో  ఎవ్వరం చెప్పలేం..ఊహించని ప్రమాదాలు మన చుటూ ఎన్నో ఉంటాయి. జాగ్రత్త పడకపోతే ఇక అంతే.. అయితే  క్షణకాలంలో పెను ప్రమాదాల నుంచి తప్పించుకున్న అదృష్టవంతులను మనం చూసాం.. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన కూడా అలాంటిదే.. రష్యాలో ఓ జంట పెద్ద ప్రమాదం నుంచి  తప్పించుకున్నారు. ముర్మాన్స్క్ ప్రాంతంలోని కోలా నగరంలో భార్యాభర్తలు తమ కారును ఇంటి బయట పార్క్ చేశారు.  ఉదయానే పనిమీద బయటకు వెళ్లేందుకు కారును తీయబోయారు. ఇద్దరు అలా కారు డోరు ఓపెన్ చేసి లోపల కూర్చోగానే ఓ పెద్ద మంచు గడ్డ ఒక్కసారిగా కారు పైన పడింది.

దాంతో ఆ జంట బ్రతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టారు. దాదాపు 50 అడుగుల భారీ మంచుగడ్డ కారు పైన పడటంతో  కారు ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదం ఇంటిముందు ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో చూస్తే ఒళ్ళు జల్లుమనక మానదు. ఇప్పుడు ఈ వీడియో  సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియోను దాదాపు 30 వేల మందికి పైగా  వీక్షించారు. ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియా యూజర్లు కొందరు ఆ దంపతుల గురించి ఆరా తీశారట. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.