AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Packaged Food: ప్యాకేజ్డ్ ఫుడ్స్ వెనుక అసలు నిజాలు.. కొనే ముందు ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి

ఈ ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది ప్యాకేజ్డ్ ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వాటిని కొనే ముందు ఆహార లేబుల్‌ను తప్పక చదవాలని... పోషక విలువలు, చక్కెర, ఉప్పు, కొవ్వు శాతం కచ్చితంగా తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్టేనని చెబుతున్నారు.

Packaged Food: ప్యాకేజ్డ్ ఫుడ్స్ వెనుక అసలు నిజాలు.. కొనే ముందు ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి
Are Packaged Foods Safe
Vijay Saatha
| Edited By: |

Updated on: Jun 30, 2026 | 9:17 PM

Share

ఈ రోజుల్లో చాలా మంది స్లిమ్‌గా ఫిట్‌గా మారాలని చూస్తున్నారు.. ఇందుకోసం జిమ్‌కు వెళ్లడం, డైట్స్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో వండుకునే టైమ్ లేక మార్కెట్‌లో లభించే ప్యాకేజ్డ్ ఫుడ్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వారికి ఆరోగ్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. ప్యాకేజ్ ఫుడ్స్ కొనే ముందు ఆకర్షణీయమైన ప్యాకింగ్‌ను మాత్రమే కాకుండా.. ఆహార పదార్థాలపై ఉండే లేబుల్‌ను తప్పనిసరిగా చదవాలని, అందులోని పోషక విలువలు, పదార్థాల వివరాలు, చక్కెర, ఉప్పు, కొవ్వు శాతం వంటి సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని చెబుతున్నారు.

ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరమైన ఆహారాలను గుర్తించి దూరంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఆహార ఉత్పత్తుల లేబుల్‌పై క్యాలరీలు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్, సోడియం, చక్కెర వంటి వివరాలు ఉంటాయని.. వీటిని పరిశీలించడం ద్వారా ఆ ఉత్పత్తి ఆరోగ్యానికి ఎంతవరకు అనుకూలమో అంచనా వేయవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా అధిక చక్కెర, అధిక ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్ ఉన్న ఉత్పత్తులను తరచూ తీసుకోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాగే ఉత్పత్తిలో ఉపయోగించిన పదార్థాల జాబితాను కూడా జాగ్రత్తగా చదవాలని.. ఎక్కువ రసాయనాలు, కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్‌లు ఉన్న ఉత్పత్తులను వీలైనంత వరకు తగ్గించాలని సూచిస్తున్నారు. తక్కువ పదార్థాలతో, సహజ పదార్థాలతో తయారైన ఉత్పత్తులను ఎంపిక చేసుకోవడం ఆరోగ్యానికి మేలని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు, తయారీ తేదీ, గడువు తేదీ , నిల్వ విధానం, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ వివరాలు కూడా తప్పనిసరిగా పరిశీలించాలని.. ఒకే తరహా ఉత్పత్తుల్లో పోషక విలువలను పోల్చి చూసి మెరుగైన ఎంపిక చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

ప్రస్తుతం జీవనశైలిలో ప్యాకేజ్డ్ ఫుడ్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతి కొనుగోలు సమయంలో లేబుల్ చదివే అలవాటు పెంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. చిన్న జాగ్రత్తే భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us