ఐస్‌క్రీమ్ ఇష్టమే కానీ.. తింటే విరేచనాలా?

30 June 2026

TV9 Telugu

TV9 Telugu

వేసవి వచ్చిందంటే ఐస్‌క్రీమ్‌ల విక్రయాలు ఊపందుకుంటాయి. అయితే చాలా మంది కాలం ఏదైనా వివిధ ఫ్లేవర్లలో దొరికే ఐస్‌క్రీమ్‌లను లాగించేస్తుంటారు

TV9 Telugu

ఐస్‌క్రీమ్‌లు, కుల్ఫీలను పాలు, పాల పదార్థాలతో తయారుచేస్తారు. ఫ్రోజెన్‌ డెజర్ట్‌లో మాత్రం వెజిటేబుల్‌ ఫ్యాట్‌ లేదా పామాయిల్‌ ఉపయోగిస్తారు

TV9 Telugu

అందుకే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ దీన్ని ఫ్రోజెన్‌ డెజర్ట్‌గా వర్గీకరించింది. ఐస్‌క్రీమ్‌తో పోలిస్తే సుమారు 50 శాతం వరకు ఫ్రోజెన్‌ డెజర్ట్‌ ధర తక్కువగా ఉంటుంది

TV9 Telugu

ఈ విషయం తెలియక మార్కెట్లో దొరికేవన్నీ ఐస్‌ క్రీమ్‌లని భావించే మనలో చాలా మంది తినేస్తుంటారు. దీంతో కొందరికి ఐస్‌క్రీమ్‌ తింటే విరేచనాలు పట్టుకుంటుంటాయి

TV9 Telugu

దీనికి కారణం ఐస్‌క్రీమ్‌ తయారీలో ఉపయోగించిన పాలలోని చక్కెర పడకపోవటం. దీన్నే ల్యాక్టోజ్‌ ఇంటాలరెన్స్‌ అంటారు. దీనికి కారణం ల్యాక్టేజ్‌ అనే ఎంజైమ్‌ లోపం

TV9 Telugu

ఈ ఎంజైమ్‌ చిన్న పేగుల్లో ఉత్పత్తి అవుతుంది. ఇది కొద్దిగా ఉత్పత్తయ్యేవారు పాల ఉత్పత్తులను జీర్ణం చేసుకోగలరు. కానీ చాలా తక్కువగా ఉత్పత్తయ్యేవారిలో ల్యాక్టోజ్‌ పూర్తిగా జీర్ణం కాదు

TV9 Telugu

పేగుల్లోని బ్యాక్టీరియా దీన్ని పులిసేలా చేస్తుంది. దీంతో కడుపుబ్బరం, కడుపు నొప్పి, విరేచనాల వంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి

TV9 Telugu

కొన్ని వారాల పాటు ఐస్‌క్రీమ్, ఇతర పాల పదార్థాలు తినటం మానేస్తే లక్షణాలు తగ్గుముఖం పడుతున్నట్టయితే ల్యాక్టోజ్‌ పడటం లేదనే అర్థం