AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరికొత్త మోడల్‌లో మధ్యతరగతి కుటుంబాల కారు..! తక్కువ బడ్జెట్‌లో SUV లుక్‌

రూ. 5 లక్షల బడ్జెట్‌లో కారు కొనాలనుకుంటున్నారా? అయితే మీ కోసం రెనాల్ట్ ఒక సరికొత్త కానుకను సిద్ధం చేసింది. తన అత్యంత సరసమైన కారు క్వీడ్‌ను మరింత ఆకర్షణీయమైన ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొస్తోంది. అసలు ఈ కారులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఏయే ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి?

సరికొత్త మోడల్‌లో మధ్యతరగతి కుటుంబాల కారు..! తక్కువ బడ్జెట్‌లో SUV లుక్‌
Renault Kwid Facelift.jpg
Nikhil
|

Updated on: Jun 30, 2026 | 9:09 PM

Share

మధ్యతరగతి కుటుంబాల ఆశల కారు రెనాల్ట్ క్విడ్ కొత్త రూపంలో రాబోతోంది. జూలై 3న విడుదల కానున్న ఈ కారు, ఎస్‌యూవీ తరహా లుక్‌తో యువతను, చిన్న కుటుంబాలను ఉర్రూతలూగించడానికి సిద్ధమైంది. అప్‌డేటెడ్ డిజైన్, భారీ టచ్‌స్క్రీన్ వంటి అదనపు హంగులతో వస్తున్న ఈ కారు గురించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

బడ్జెట్ కార్ల మార్కెట్‌లో సరికొత్త సంచలనానికి తెరలేవబోతోంది. సుమారు రూ. 5 లక్షల బడ్జెట్‌లో సొంత కారు కొనాలని కలలు కంటున్న మధ్యతరగతి వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రెనాల్ట్ ఇండియా తన అత్యంత ప్రజాదరణ పొందిన ‘క్విడ్’ కారులో సరికొత్త మార్పులతో ‘ఫేస్‌లిఫ్ట్’ వెర్షన్‌ను జూలై 3, 2026న విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఆకర్షణీయమైన లుక్‌తో పాటు అధునాతన ఫీచర్లతో రాబోతున్న ఈ కారు, మార్కెట్‌లో ఉన్న ఇతర ఎంట్రీ లెవల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

అధునాతన ఇంటీరియర్

కొత్త రెనాల్ట్ క్విడ్ లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. మునుపటి కంటే మరింత స్టైలిష్‌గా కనిపించేలా దీనిని రూపొందించారు. ముందు భాగంలో కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు, మరియు వై-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్ దీనికి కొత్త లుక్ ఇస్తాయి. వెనుక భాగంలో కూడా మార్పులు చేసిన టెయిల్‌లైట్లు, మోడిఫైడ్ బంపర్లను అమర్చారు.

కారు పాత మాదిరిగానే ఎస్‌యూవీ తరహా లుక్ మరియు కాంపాక్ట్ సైజుతో రానుండటం వల్ల నగర ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేయడం చాలా సులభం. ఇంటీరియర్ విషయానికి వస్తే, క్యాబిన్‌లో 10 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పవర్ విండోస్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

ఇంజిన్ సామర్థ్యం

సాంకేతిక పరంగా ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు లేవు. ఇందులో 1.0 లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సుమారు 68 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. మైలేజీ విషయానికొస్తే, ఇది సుమారు 22 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే అవకాశం ఉంది.

భద్రత కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లను జోడించారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.80 లక్షల నుంచి రూ. 5.50 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మారుతి ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, సెలెరియో కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. మొదటిసారి కారు కొనేవారికి మరియు నగరాల్లో తిరిగే వారికి ఇది ఒక గొప్ప ఎంపికగా నిలవనుంది.

Follow Us
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవ్! ఎందుకంటే..
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్ 19న సెలవ్! ఎందుకంటే..
అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి? మొదట పెట్టాల్సిన పువ్వు ఏదో తెలుసా?
అసలు బతుకమ్మను ఎలా పేర్చాలి? మొదట పెట్టాల్సిన పువ్వు ఏదో తెలుసా?
తల్లి ప్రేమ.. ఇచ్చినమాట.. నిజాయితీ! ప్రతి ఒక్కరూ చదవాల్సిన నీతికథ
తల్లి ప్రేమ.. ఇచ్చినమాట.. నిజాయితీ! ప్రతి ఒక్కరూ చదవాల్సిన నీతికథ
‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. క్షణాల్లో కుప్పకూలి మృతి
‘నాన్నా.. ఈ చొక్కాలు బాగున్నాయి’ అంటూ.. క్షణాల్లో కుప్పకూలి మృతి
అక్టోబర్ 17 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలత
అక్టోబర్ 17 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలత
నవరాత్రుల ఏడో రోజు అమ్మవారి కాలరాత్రి రూపం.. పూజా విధానం..
నవరాత్రుల ఏడో రోజు అమ్మవారి కాలరాత్రి రూపం.. పూజా విధానం..
కిక్ సినిమాలో నటించిన ఈ భామ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా
కిక్ సినిమాలో నటించిన ఈ భామ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా
రెండు మూడు సినిమాలతో కనిపించకుండా మాయం అయ్యింది..
రెండు మూడు సినిమాలతో కనిపించకుండా మాయం అయ్యింది..
అప్పట్లో ఊపేసింది.. ఇప్పుడు కనిపించకుండా మాయం అయ్యింది
అప్పట్లో ఊపేసింది.. ఇప్పుడు కనిపించకుండా మాయం అయ్యింది
బయట కొన్నట్లే ఎర్రగా, క్రిస్పీగా గోబీ 65.. సింపుల్ రెసిపీ ఇదిగో!
బయట కొన్నట్లే ఎర్రగా, క్రిస్పీగా గోబీ 65.. సింపుల్ రెసిపీ ఇదిగో!