బక్రీద్‌కు మార్గదర్శకాలు విడుదల చేసిన డబ్లుహెచ్‌వో

|

Jul 31, 2020 | 1:23 AM

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో నూతన మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) విడుదల చేసింది. బక్రీద్ పండుగ సందర్భంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించింది. సామాజికదూరం పాటించడంతోపాటు మాస్కును తప్పని సరిగా ధరించాలని సూచించింది. జంతు వధ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తను కూడా వివరించింది. అనారోగ్యం బారినపడిన గొర్రెలను, ఇతర జంతువులను వధించరాదని.., అస్వస్థతతో ఉన్న జంతువులను ప్రత్యేకంగా ఐసోలేషన్ లో ఉంచాలని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. సాధ్యమైనంత వరకు ఇళ్ల వద్ద జంతు వధకు చేయవద్దని తెలిపింది. అంతేకాదు, […]

బక్రీద్‌కు మార్గదర్శకాలు విడుదల చేసిన డబ్లుహెచ్‌వో
Follow us on

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో నూతన మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) విడుదల చేసింది. బక్రీద్ పండుగ సందర్భంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరించింది. సామాజికదూరం పాటించడంతోపాటు మాస్కును తప్పని సరిగా ధరించాలని సూచించింది.

జంతు వధ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తను కూడా వివరించింది. అనారోగ్యం బారినపడిన గొర్రెలను, ఇతర జంతువులను వధించరాదని.., అస్వస్థతతో ఉన్న జంతువులను ప్రత్యేకంగా ఐసోలేషన్ లో ఉంచాలని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. సాధ్యమైనంత వరకు ఇళ్ల వద్ద జంతు వధకు చేయవద్దని తెలిపింది.

అంతేకాదు, బక్రీద్ సందర్భంగా ఒకరినొకరు భౌతికంగా తాకే రీతిలో పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోవడం కాకుండా,  చేయి ఊపడం, హృదయంపై చేయి ఆన్చడం వంటి చర్యలతోనూ బక్రీద్ విషెస్ చెప్పవచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.