AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: ఏపీ సీఈసీగా రమేశ్‌కుమార్‌ తిరిగి నియామకం

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను మళ్లీ నియమించింది. ఈ మేరకు పునర్నియమిస్తూ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరుతో ప్రకటన విడుదల చేశారు.

Breaking: ఏపీ సీఈసీగా రమేశ్‌కుమార్‌ తిరిగి నియామకం
Balaraju Goud
|

Updated on: Jul 31, 2020 | 1:54 AM

Share

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను మళ్లీ నియమించింది. ఈ మేరకు పునర్నియమిస్తూ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరుతో ప్రకటన విడుదల చేశారు. రమేష్ కుమార్ నియామకానికి సంబంధించి గెజిట్‌ విడుదల చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్‌ ఉంటుందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌(ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌నే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఈసీగా రమేశ్‌కుమార్‌ను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరుతో ప్రకటన జారీ చేశారు.

Follow Us
న్యాయం కోసం ఇద్దరు తిరిగే ఇద్దరు మహిళలు.. ఓటీటీలోకి లీగల్ డ్రామా.
న్యాయం కోసం ఇద్దరు తిరిగే ఇద్దరు మహిళలు.. ఓటీటీలోకి లీగల్ డ్రామా.
TG PECET 2026 దరఖాస్తు గడువు పెరిగిందోచ్‌.. ఎప్పటి వరకంటే?
TG PECET 2026 దరఖాస్తు గడువు పెరిగిందోచ్‌.. ఎప్పటి వరకంటే?
భారతదేశంలో మొట్టమొదటి ఏసీ..50 డిగ్రీల ఎండలోనూ గది మొత్తం కూల్‌..
భారతదేశంలో మొట్టమొదటి ఏసీ..50 డిగ్రీల ఎండలోనూ గది మొత్తం కూల్‌..
ఇంట్లో వెల్లుల్లి రసం ఇలా చేసుకోండి.. తినడం కాదు తాగుతారు..
ఇంట్లో వెల్లుల్లి రసం ఇలా చేసుకోండి.. తినడం కాదు తాగుతారు..
మమత పాలనకు నిరసనగా తాడేపల్లి గూడెం మహిళ చేసిన అసాధారణ చర్య!
మమత పాలనకు నిరసనగా తాడేపల్లి గూడెం మహిళ చేసిన అసాధారణ చర్య!
పోలీసులను పిలవండి.. లాయర్‌పై హైకోర్టు జడ్జి ఆగ్రహం..
పోలీసులను పిలవండి.. లాయర్‌పై హైకోర్టు జడ్జి ఆగ్రహం..
జననాయగన్‌ టైటిల్స్‌ మార్పులు చేయాలి..ఫ్యాన్స్‌ స్పెషల్ రిక్వెస్ట్
జననాయగన్‌ టైటిల్స్‌ మార్పులు చేయాలి..ఫ్యాన్స్‌ స్పెషల్ రిక్వెస్ట్
మళ్లీ మొదలైన ఉద్యోగాల జాతర.. 39 వేల ఉద్యోగాలు వస్తున్నాయ్
మళ్లీ మొదలైన ఉద్యోగాల జాతర.. 39 వేల ఉద్యోగాలు వస్తున్నాయ్
11 ఫోర్లు, 8సిక్స్‌లు.. 35 బంతుల్లో సెంచరీతో ఊచకోత
11 ఫోర్లు, 8సిక్స్‌లు.. 35 బంతుల్లో సెంచరీతో ఊచకోత
చనిపోయిందని చెప్పి శిశువును అమ్మేశారు.. చివరికి ఏమైంది?
చనిపోయిందని చెప్పి శిశువును అమ్మేశారు.. చివరికి ఏమైంది?