మనం ప్రతిరోజూ వాడే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లలో అతి ముఖ్యమైనది సెల్ ఫోన్ (Cell Phone). అది లేనిదే మనకు క్షణం కూడా నిలవదు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు అనుక్షణం దానితోనే సావాసం. అయితే అధిక సమయం మొబైల్ ఫోన్లను వాడటం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. అవి మనుషులకే కాకుండా ఫోన్లకూ నష్టం కలిగిస్తాయి. ఫోన్లలోని బ్యాటరీలు డ్యామేజ్ కావడమో లేదా బాగా హీట్ అవడం వల్ల కొన్ని సార్లు పేలిపోతుంటాయి. ఇలాంటి ఘటనలు ఇది వరకు మనం ఎన్నో చూశాం. ప్రాణాలు కోల్పోయిన వారితో పాటు, తీవ్ర గాయాలపాలైన వారు కూడా చాలా మందే ఉన్నారు. కొందరు మాత్రం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటారు. ప్రస్తుతం అలాంటి ఘటనే జరిగింది. మొబైల్ షాపులో ఓ వ్యక్తి ఫోన్ ను రిపేర్ చేస్తున్న సమయంలో అది ఒక్కసారిగా పేలింది. అందులో నుంచి మంటలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ వ్యక్తి ఫోన్ ను కింద పడేసి ప్రాణభయంతో పరుగులు తీశాడు. అయినప్పటికీ.. ఆ ఫోన్ నుంచి మంటలు వస్తూనే ఉన్నాయి. క్షణాల్లోనే మొబైల్ రిపేరు చేసే వ్యక్తి స్పందించడంతో ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
ఈ దృశ్యాలు మొబైల్ రిపేరింగ్ షాప్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. వీడియోను ఒక యూట్యూబ్ ఛానల్ షేర్ చేసింది. వియత్నంలోని థాయ్ గుయెన్‌లోని ఓ మొబైల్ రిపేరింగ్ షాపులో సెల్ ఫోన్ బ్యాటరీ పేలినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఫోన్ బ్యాటరీ ఉబ్బినా, బాగా హీటెక్కినా, ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాడుతున్నా, గేమ్స్ ఆడుతున్నా ఫోన్ బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఫోన్ వినియోగించేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి