అనధికారిక యాప్స్ వాడొద్దని ‘వాట్సాప్’ హెచ్చరిక

| Edited By:

Mar 11, 2019 | 5:12 PM

కొంతమంది థర్డ్‌పార్టీ వాళ్లు రూపొందించిన మోడెడ్ వెర్షన్ వాట్సాప్ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. అఫీషియల్ యాప్‌లో లేనటువంటి కొన్ని ఫీచర్లు ఈ మోడెడ్ యాప్స్‌లో అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ ప్లస్, జీబీ వాట్సాప్ వంటి వాటిని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదనపు ఫీచర్లు ఉన్నాయని మోడెడ్ యాప్స్ ఉపయోగిస్తే అసలుకే ముప్పు వస్తుందని వాట్సాప్ హెచ్చరించింది. ఈ యాప్స్ వల్ల హ్యాకింగ్ బారినపడే అవకాశముందని పేర్కొంది. వ్యక్తిగత సమాచారం, చాట్ హిస్టరీ, కాంటాక్ట్ డీటైల్స్ వంటి వాటికి ప్రమాదం […]

అనధికారిక యాప్స్ వాడొద్దని వాట్సాప్ హెచ్చరిక
Follow us on

కొంతమంది థర్డ్‌పార్టీ వాళ్లు రూపొందించిన మోడెడ్ వెర్షన్ వాట్సాప్ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. అఫీషియల్ యాప్‌లో లేనటువంటి కొన్ని ఫీచర్లు ఈ మోడెడ్ యాప్స్‌లో అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ ప్లస్, జీబీ వాట్సాప్ వంటి వాటిని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

అదనపు ఫీచర్లు ఉన్నాయని మోడెడ్ యాప్స్ ఉపయోగిస్తే అసలుకే ముప్పు వస్తుందని వాట్సాప్ హెచ్చరించింది. ఈ యాప్స్ వల్ల హ్యాకింగ్ బారినపడే అవకాశముందని పేర్కొంది. వ్యక్తిగత సమాచారం, చాట్ హిస్టరీ, కాంటాక్ట్ డీటైల్స్ వంటి వాటికి ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. ఇప్పటికే కొందరు యూజర్లను బ్యాన్ చేసినట్లు వాట్సాప్ ప్రకటించింది.

నిషేధం ఎదుర్కున్న యూజర్లకు కంపెనీ ఒక మెసేజ్ పంపింది. ఇందులో వాట్సాప్ నుంచి మీ నెంబర్ నిషేధానికి గురైంది అని ఉంటుంది. మీకు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చి ఉంటే థర్డ్‌పార్టీ యాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేసి, గూగుల్ ప్లేస్లోర్ నుంచి అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.