AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందమైన మొహాన్ని పాడుచేసిన శానిటైజర్‌

శానిటైజర్‌కు మండే గుణం ఎక్కువ.. అంచేత ఆ ద్రావణంతో కాసింత జాగ్రత్తగా మెలగాలి..లేకపోతే కేట్‌వైడ్‌లా పరిస్థితి అవుతుంది..

అందమైన మొహాన్ని పాడుచేసిన శానిటైజర్‌
Balu
|

Updated on: Sep 05, 2020 | 2:05 PM

Share

శానిటైజర్‌కు మండే గుణం ఎక్కువ.. అంచేత ఆ ద్రావణంతో కాసింత జాగ్రత్తగా మెలగాలి..లేకపోతే కేట్‌వైడ్‌లా పరిస్థితి అవుతుంది.. ఎవరీ కేట్‌వైడ్‌ అంటారా? అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో ఉంటుంది.. మొన్న ఆదివారం ఎప్పటిలాగే తన చేతులకు శానిటైజర్‌ రాసుకుంది.. రాసుకున్నాక క్యాండిల్‌ వెలిగించడం కోసం అగ్గిపుల్ల గీసింది.. అదే ఆమె చేసిన తప్పిదం.. చేతికి మంటలు అంటుకున్నాయి.. ఒక్కసారిగా చేతికి మంటలు అంటుకోవడంతో భీతిల్లిన ఆమె వెనక్కి మళ్లింది.. అలా ఆమె రెండో తప్పు చేసింది. ఎందుకంటే వెనకాలే శానిటైజర్‌ బాటిల్‌ ఉంది.. అది కాస్త భగ్గున మండింది.. మండటమే కాదు బాంబులా పేలింది.. దాంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.. ఆ మంటలకు ఆమె ముఖం, చేతులు, కాళ్లు కాలాయి.. ఆ టైమ్‌లో ఇంట్లో కేట్‌వైడ్‌ కూతుళ్లు ఉన్నారు కాబట్టి సరిపోయింది. వారు వెంటనే స్థానికుల సాయంతో తల్లిని హాస్పిటల్‌లో చేర్చారు.. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది.. ఈ సంఘటన మనకు నేర్పిస్తున్న పాఠమేమిటంటే శానిటైజర్‌ చేతులకు పూసుకున్న తర్వాత నిప్పుకు దూరంగా ఉండమని!

Follow Us
చాణక్యుని సక్సెస్ టిప్స్.. విజయానికి మిస్ కాకూడని మార్గదర్శకాలు
చాణక్యుని సక్సెస్ టిప్స్.. విజయానికి మిస్ కాకూడని మార్గదర్శకాలు
తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..
తల్లి కోసం భారత్ వస్తే .. మూసుకుపోయిన అమెరికా దారులు..
బిగ్‌ అలర్ట్.. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన
బిగ్‌ అలర్ట్.. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన
"అమ్మా.. తిరిగి వస్తానో లేదో తెలీదు" పైలెట్ మాటలు
రైల్వే ప్రయాణీకులు బిగ్ బంపర్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి..
రైల్వే ప్రయాణీకులు బిగ్ బంపర్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి..
ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కీలక అప్‌డేట్.. షెడ్యూల్
ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కీలక అప్‌డేట్.. షెడ్యూల్
అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..
అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..
ఉగాది స్పెషల్.. మృదువైన, రుచికరమైన పప్పు బక్షాలు.. ఇంట్లోనే ఈజీగా
ఉగాది స్పెషల్.. మృదువైన, రుచికరమైన పప్పు బక్షాలు.. ఇంట్లోనే ఈజీగా
బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై కేంద్రం భారీ ఊరట.. ఇకపై 24 గంటలు
బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై కేంద్రం భారీ ఊరట.. ఇకపై 24 గంటలు
పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు..
పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు..