హుద్ హుద్ కన్నా మించినది.. ఫొని తుఫాన్..

భీకర గాలులు.. గంటకు 2వందల కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులు.. రోడ్డు మీద నిల్చుంటే కొట్టుకుపోతామా అన్న రీతిలో వీచే భయంకరమైన గాలులు. ఇదంతా సముద్రాన్ని అతలాకుతలం చేస్తోన్న ఫొని తుఫాన్ తీవ్రత. తుఫాన్‌గా మారిన ఫొని.. గంట గంటకు తీవ్రత పెంచుకుంటోంది. ఫొని అతి భయంకరమైన తుఫాన్‌గా మారితే.. గంటకు 165 కిలోమీటర్ల నుంచి 175 కిలోమీటర్లకు గాలుల వేగం మించుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫొని అతి భయంకరమైన తుఫాన్‌గా మారితే గంటకు […]

హుద్ హుద్ కన్నా మించినది.. ఫొని తుఫాన్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 29, 2019 | 7:39 AM

భీకర గాలులు.. గంటకు 2వందల కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులు.. రోడ్డు మీద నిల్చుంటే కొట్టుకుపోతామా అన్న రీతిలో వీచే భయంకరమైన గాలులు. ఇదంతా సముద్రాన్ని అతలాకుతలం చేస్తోన్న ఫొని తుఫాన్ తీవ్రత.

తుఫాన్‌గా మారిన ఫొని.. గంట గంటకు తీవ్రత పెంచుకుంటోంది. ఫొని అతి భయంకరమైన తుఫాన్‌గా మారితే.. గంటకు 165 కిలోమీటర్ల నుంచి 175 కిలోమీటర్లకు గాలుల వేగం మించుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫొని అతి భయంకరమైన తుఫాన్‌గా మారితే గంటకు 200 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముంది.

ఈ ఫొని హుద్ హుద్ తుఫాన్ కన్నా తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఈ తుఫాన్ ప్రభావంతో విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. దీంతో.. ఇప్పటికే అన్ని ఓడ రేవుల్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.