AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలకు కోవిద్ సోకవచ్చు …అప్రమత్తత అవసరం, నీతి ఆయోగ్ సభ్యుడు డా. వీ.కె. పాల్ హెచ్చరిక .. నిపుణుల అధ్యయనం పై దృష్టి పెట్టామని వెల్లడి

దేశంలో పిల్లలకు కోవిద్ సోకవచ్చునని మనం అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు డా. వీ.కె. పాల్ అన్నారు. వారిలో స్వల్ప లక్షణాలు మాత్రం ఉంటాయని చెప్పిన ఆయన..

పిల్లలకు కోవిద్ సోకవచ్చు ...అప్రమత్తత అవసరం, నీతి ఆయోగ్  సభ్యుడు డా. వీ.కె. పాల్ హెచ్చరిక .. నిపుణుల అధ్యయనం పై దృష్టి పెట్టామని వెల్లడి
V.k.paul
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 22, 2021 | 11:01 PM

Share

దేశంలో పిల్లలకు కోవిద్ సోకవచ్చునని మనం అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు డా. వీ.కె. పాల్ అన్నారు. వారిలో స్వల్ప లక్షణాలు మాత్రం ఉంటాయని చెప్పిన ఆయన.. సెకండ్ కోవిద్ తరుణంలో బాలలను కాపాడుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై నిపుణులు దృష్టి పెట్టారని తెలిపారు. ఏమైనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాల్సి ఉందని, దీనికి పిల్లలు గురి కాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలన్నారు. ఇండియాలో 26 శాతం జనాభాలో 14 ఏళ్ళ లోపు ఉన్నారని, అయిదేళ్ల లోపు వారు సుమారు 7 శాతం మంది ఉన్నారని ఆయన చెప్పారు. ఈ వైరస్ చైన్ చైన్ వారికీ దగ్గర కాకూడదన్నారు . కాగా ఇటీవలి కాలంలోనగరాలు, పట్టణాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో కోవిద్ వ్యాపించింది, ఇది ఆందోళన కలిగించే అంశమని పాల్ పేర్కొన్నారు. అటు పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ చేయించే అంశాన్ని ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత్ బయో టెక్ సంస్థ 2 నుంచి 18 ఏళ్ళ లోపు బాలలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని, ఇందుకు రెండు, మూడు క్లినికల్ పరీక్షలకు అనుమతించాలని కోరిందని ఆయన వివరించారు. మరో వారం పది రోజుల్లో దేశంలో మూడు చోట్ల క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కావచ్చునని ఆయన చెప్పారు.

ఇప్పటికే పలు దేశాలు బాలలకు యుధ్ధ ప్రాతిపదికన టీకామందులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్నీ ఆయన గుర్తు చేశారు . సింగపూర్ అప్పుడే ఫైజర్ బయో ఎన్ టెక్ టీకామందులను పిల్లలకు ఇచ్చే యోచనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయని పాల్ పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Blind Village : ఆ గ్రామంలో మనుషులు, జంతువులు అందరూ గుడ్డివారే..! కారణం తెలిస్తే షాక్ అవుతారు..

Covid-19 Second Wave: వైద్యులపై కరోనా పంజా.. సెకండ్ వేవ్‌లో ఎంతమంది అమరులయ్యారంటే..?