AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Tauktae: నేనేమీ హెలికాప్టర్‌లో ఉండి ఫొటో సెషన్ నిర్వహించలేదు.. బీజేపీ నేతలపై సీఎం ఉద్ధవ్ ఫైర్

Uddhav Thackeray: దేశంలోని పలు రాష్ట్రాల్లో తౌక్టే తుఫాను అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ తుఫాను పర్యటనలపై మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన, విపక్ష బీజేపీ

Cyclone Tauktae: నేనేమీ హెలికాప్టర్‌లో ఉండి ఫొటో సెషన్ నిర్వహించలేదు.. బీజేపీ నేతలపై సీఎం ఉద్ధవ్ ఫైర్
Uddhav Thackeray
Shaik Madar Saheb
|

Updated on: May 22, 2021 | 10:51 PM

Share

Uddhav Thackeray: దేశంలోని పలు రాష్ట్రాల్లో తౌక్టే తుఫాను అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ తుఫాను పర్యటనలపై మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన, విపక్ష బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. కొంకణ్ ప్రాంతంలో తౌక్టే తుఫాను నష్టం పరిశీలనకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కేవలం కొన్ని గంటలే కేటాయించారని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ మేరకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. బీజేపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ప్రధానమంత్రి మోదీ ఏరియల్ సర్వేను విమర్శించారు.

బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు సరే.. తాను నాలుగు గంటలైనా క్షేత్ర స్థాయిలో పర్యటించా… ప్రజల దగ్గరికి వెళ్లి వారి పరిస్థితులను చూశా… తానేమీ హెలికాప్టర్‌లో ఉంటూ ఫొటో సెషన్ నిర్వహించలేదంటూ కౌంటర్ ఇచ్చారు. తాను స్వతహాగా ఫొటోగ్రాఫర్‌నని.. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి తాను ప్రజల దగ్గరికి రాలేదంటూ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఘాటు కౌంటర్ ఇచ్చారు.

తౌక్టే తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సీఎం ఉద్ధవ్ ఠాక్రే తాజాగా పర్యటించారు. ఇందులో భాగంగా కొంకణ్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనపై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్‌వీస్ విమర్శలు గుప్పించారు. కేవలం మూడు గంటల్లోనే తౌక్టే ఇబ్బందులను సీఎం ఉద్ధవ్ ఎలా అవగాహన చేసుకున్నారంటూ మాజీ సీఎం ఫడ్నవిస్ విమర్శలు చేయగా.. సీఎం ఉద్ధవ్ కౌంటర్ ఇచ్చారు.

Also Read:

Ramdev Baba : అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రామ్ దేవ్ బాబా.. మండిపడుతున్న వైద్య సంఘాలు..

Groom Asked Bullet : వరుడు కట్నంగా బుల్లెట్ బైక్ అడిగాడు..! అత్తారింటి వారు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..