మీరు నీళ్లు ఆపితే మాకేమీ నష్టం లేదు: పాక్

| Edited By: Srinu

Mar 07, 2019 | 5:31 PM

పుల్వామాపై ఉగ్రదాడి చేసినప్పటి నుంచి విర్ర వీగుతున్న పాకిస్థాన్.. మరోసారి తమ మాటల పైత్యాన్ని చూపింది. భారత్ నుంచి తూర్పు ప్రాంతంలో ప్రవహించే నదీ జలాల్ని పాకిస్థాన్‌కు వెళ్లకుండా నిలువరిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించగా.. ఆ నీళ్లు ఆపేస్తే మాకేమీ నష్టం లేదంటూ తెలిపింది. ఈ మేరకు పాక్ నీటి పారుదల శాఖ సెక్రటరీ ఖవాజా షుమాలి అన్నారు. తూర్పు ప్రాంత నదుల జలాల్ని మళ్లించడంపై మాకు ఎలాంటి అభ్యంతరం, ఆందోళన లేదు. భారత్ తీసుకున్న […]

మీరు నీళ్లు ఆపితే మాకేమీ నష్టం లేదు: పాక్
Follow us on

పుల్వామాపై ఉగ్రదాడి చేసినప్పటి నుంచి విర్ర వీగుతున్న పాకిస్థాన్.. మరోసారి తమ మాటల పైత్యాన్ని చూపింది. భారత్ నుంచి తూర్పు ప్రాంతంలో ప్రవహించే నదీ జలాల్ని పాకిస్థాన్‌కు వెళ్లకుండా నిలువరిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించగా.. ఆ నీళ్లు ఆపేస్తే మాకేమీ నష్టం లేదంటూ తెలిపింది. ఈ మేరకు పాక్ నీటి పారుదల శాఖ సెక్రటరీ ఖవాజా షుమాలి అన్నారు.

తూర్పు ప్రాంత నదుల జలాల్ని మళ్లించడంపై మాకు ఎలాంటి అభ్యంతరం, ఆందోళన లేదు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై మేమేం బాధ పడం. కానీ మేం ఉపయోగించుకునే సింధు, జీలం, చీనాబ్ నదీ జలాల నీటిని అడ్డుకుంటే మాత్రం వ్యతిరేకిస్తాం. 1960లో కూడా తూర్పు ప్రాంత నదుల జలాల్ని వారి కోసం మళ్లించుకున్నారు. అప్పుడు మేమేం అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు అంటూ ఆయన పేర్కొన్నారు. కాగా సింధూ జల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్ నదులు పాక్‌కు దక్కగా.. రావి, బియస్, సట్లెజ్ నదులు భారత్‌కు దక్కిన విషయం తెలిసిందే.