కరోనా వార్డులో జలపాతం..

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఆ భవనంలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తుంటారు. ఆ ప్రాంతంలో భారీ వర్షం పడడంతో.. భవనం సీలింగ్ నుంచి వర్షం

కరోనా వార్డులో జలపాతం..

Edited By:

Updated on: Jul 19, 2020 | 7:53 PM

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఆ భవనంలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తుంటారు. ఆ ప్రాంతంలో భారీ వర్షం పడడంతో.. భవనం సీలింగ్ నుంచి వర్షం ధారాపాతంగా కురవడంతో కరోనా వార్డు నీటితో నిండిపోయింది. దీంతో బాధితులందరినీ వేరే చోటకు తరలించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఓ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ కరోనా వార్డు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఓవైపు కరోనా కట్టడికోసం దేశంలో అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం దురదృష్ట కరమని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యకలాపాల్లోని డొల్లతనానికి ఇలాంటి ఘటనలే నిదర్శనమని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే దీనిపై బరేలీ డిప్యూటీ డీఎం ఇషాన్ సింగ్ వివరణ ఇచ్చారు. ఆసుపత్రిలో ప్లంబింగ్ పనులు జరుగుతుండడంతో ఈ సమస్య తలెత్తిందని, త్వరలో పరిష్కరిస్తామని వివరించారు.

[svt-event date=”19/07/2020,7:51PM” class=”svt-cd-green” ]