ఒకే ఓవర్‌లో వర్నర్, కేన్ ఔట్.. కష్టాల్లో హైదరాబాద్
దుబాయి వేదికగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తడబడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో నువ్వా నేనా అని తేల్చుకునేందుకు బ్యాటింగ్‌తో క్రీజ్‌లోకి వచ్చిన వార్నర్ జట్టు ఊగీసలాడుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తక్కువ స్కోరుకే కీలక వికెట్లు కోల్పోయింది.

పియూశ్ చావ్లా వేసిన 11వ ఓవర్లో రెండు వికెట్లను సమర్పించుకుంది. వరుస బంతుల్లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ పెవిలియన్ దారి పట్టారు. ఐదో బంతికి వార్నర్(28) క్యాచ్ ఔట్ ఇచ్చి వెనుదిరగగా.. అనవసర పరుగు కోసం ప్రయత్నించిన విలియమ్సన్(9) రనౌటయ్యాడు.
69 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ భారీ టార్గెట్‌ను ప్రత్యర్థి ముందు ఉంచడంలో విఫలయ్యేలా కనిపిస్తోంది. గౌరవ ప్రదమైన స్కోరు కోసం పోరాడుతోంది.