జలియన్‌వాలాబాగ్‌ స్మారక నాణెం విడుదల

|

Apr 14, 2019 | 7:40 AM

ఢిల్లీ: దేశ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను పతాక స్థాయికి తీసుకువెళ్లిన జలియన్‌వాలాబాగ్‌ మారణకాండకు నిన్నటితో వందేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రూ. 100 స్మారక నాణేన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విడుదల చేశారు.  అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌ స్మారకాన్ని సందర్శించిన వెంకయ్యనాయుడు.. నాటి ఘటనలో అమరులైన వారికి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్మారక నాణెంతో పాటు పోస్టల్‌ స్టాంపును కూడా ఆవిష్కరించారు. ‘జలియన్‌వాలాబాగ్‌ ఉదంతం జరిగి 100ఏళ్లు గడిచినా ఆ నాటి బాధ, ఆవేదన ప్రతి భారతీయుడి గుండెల్లో […]

జలియన్‌వాలాబాగ్‌ స్మారక నాణెం విడుదల
Follow us on

ఢిల్లీ: దేశ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను పతాక స్థాయికి తీసుకువెళ్లిన జలియన్‌వాలాబాగ్‌ మారణకాండకు నిన్నటితో వందేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రూ. 100 స్మారక నాణేన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విడుదల చేశారు.  అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌ స్మారకాన్ని సందర్శించిన వెంకయ్యనాయుడు.. నాటి ఘటనలో అమరులైన వారికి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్మారక నాణెంతో పాటు పోస్టల్‌ స్టాంపును కూడా ఆవిష్కరించారు. ‘జలియన్‌వాలాబాగ్‌ ఉదంతం జరిగి 100ఏళ్లు గడిచినా ఆ నాటి బాధ, ఆవేదన ప్రతి భారతీయుడి గుండెల్లో ఇప్పటికీ ఉండిపోయింది. చరిత్ర అంటే కేవలం జరిగిన సంఘటనలే కాదు.. గతం నుంచి నేర్చుకోవాలని హెచ్చరించేది కూడా’ అని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు.