ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ (సులభతర వ్యాపార నిర్వహణ) -2020 ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విభాగంలో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ మూడవ ర్యాంక్ సాధించింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాలు ముందువరసలో చోటు దక్కించుకోవడం ఆనందకరమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
భారత ప్రభుత్వం ప్రకటించిన సులభతర వాణిజ్య రాష్ట్రాల జాబితాలో మొదటి, మూడవ స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు అభినందనలు. ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందువరసలో చోటు దక్కించుకోవడం ఆనందదాయకం.@AndhraPradeshCM@TelanganaCMO pic.twitter.com/yoVetEFeEL
— Vice President of India (@VPSecretariat) September 5, 2020
Also Read :
జగన్‌పై దాడి కేసు: హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు శ్రీనివాసరావు