డామిట్ కథ అడ్డం తిరిగింది..! ఫ్రెండ్స్‌కు సర్‌ప్రైజ్ పార్టీ ఇద్దామనుకున్నాడు అంతలోనే..

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు గంజాయి సప్లై చేస్తూ విశాఖలో ఓ ఐటీ ఉద్యోగి పట్టుబడ్డాడు.

డామిట్ కథ అడ్డం తిరిగింది..! ఫ్రెండ్స్‌కు సర్‌ప్రైజ్ పార్టీ ఇద్దామనుకున్నాడు అంతలోనే..

Updated on: Dec 29, 2020 | 8:56 AM

Software Employee arrested: అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలన్న యావతో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు గంజాయి సప్లై చేస్తూ విశాఖలో ఓ ఐటీ ఉద్యోగి పట్టుబడ్డాడు. తమిళనాడుకు చెందిన మయవన్ గునబలన్.. బెంగుళూరులో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈసారి న్యూ ఇయర్ కు ఫ్రెండ్స్ కు గ్రాండ్ గా పార్టీ ప్లాన్ చేశాడు. అందులో భాగంగా గంజాయి మత్తుకూడా అందించి అందరికీ సర్ ప్రైజ్ ఇద్దామని అనుకున్నాడు. అంతే.. గంజాయి ఎలా సంపాదించాలనుకున్నాడు. తనకు తెలిసిన వాడితో ఓ కాంటాక్ట్ తీసుకుని విశాఖ చేరుకున్నాడు. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి నుంచి గంజాయి ప్యాకెట్ కొనుగోలు చేశాడు.

ఇక తన సంస్థ ఇచ్చిన ల్యాప్ టాప్ బ్యాగ్ లో గంజాయి ప్యాకెట్ పెట్టుకున్న ఐటీ ఉద్యోగి.. మూడో కంటికి తెలియకుండా బెంగుళూరు చెక్కేద్దామనుకున్నాడు. అప్పటికే రెగ్యులర్ గా ప్రైవేట్ ట్రావెల్స్ పై నిఘా పెట్టిన ద్వారకా పోలీసులు… అనుమానాస్పదంగా ఉన్న తమిళియన్‌ను ట్రాక్ చేసి విచారించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో బ్యాగ్‌ను తనిఖీ చేసేసరికి గంజాయి గుట్టు బయటపడింది. గంజాయి ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.