వివేకా హత్యకేసు దర్యాప్తునకు మరో సిట్..!

| Edited By:

Jun 20, 2019 | 10:52 AM

ఘోరమైన హత్యకు గురైన మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం.. అనంతపురం, చిత్తూరు, తిరుపతికి చెందిన పోలీస్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం మరోసారి వివేకా ఇంటిని పరిశీలించింది. కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఈ బృందం దర్యాప్తు చేస్తోంది. అయితే.. ఇదివరకే నియమించిన ఓ కమిటి వివేకానందరెడ్డి అనుచరులైన ఎర్రగంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిని ప్రధాన నిందితులని భావించి, వారిని […]

వివేకా హత్యకేసు దర్యాప్తునకు మరో సిట్..!
Follow us on

ఘోరమైన హత్యకు గురైన మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం.. అనంతపురం, చిత్తూరు, తిరుపతికి చెందిన పోలీస్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం మరోసారి వివేకా ఇంటిని పరిశీలించింది. కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఈ బృందం దర్యాప్తు చేస్తోంది.

అయితే.. ఇదివరకే నియమించిన ఓ కమిటి వివేకానందరెడ్డి అనుచరులైన ఎర్రగంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిని ప్రధాన నిందితులని భావించి, వారిని ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. అయితే.. ఇంకా వివేకాను ఎవరు హత్య చేసి ఉంటారనే నిజం మాత్రం ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో సిట్‌ని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ కొత్తగా ఏర్పాటైన ఈ సిట్‌లో 23 మంది అధికారులు ఉన్నారు. తాజాగా.. సిట్ అధికారులు, వివేకా వాచ్‌మెన్ రంగయ్యను విచారించారు.

మార్చి 15న వివేకానందరెడ్డి హత్యకేసు పెను సంచలనంగా మారింది. ఈ హత్యపై అప్పటి ప్రభుత్వం వెంటనే స్పందించి సిట్ దర్యాప్తుకు కూడా ఆదేశించింది.