1200 మంది సీనియర్ గ్రేడ్ ఉద్యోగులకు.. విస్తారా షాక్..

| Edited By:

Apr 15, 2020 | 4:55 PM

కోవిద్-19 మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. లాక్ డౌన్ నేపథ్యంలో విమానయాన సంస్థల ఆదాయాలు భారీగా పడిపోయాయి. ఈ ప్రభావం ఆయా విమానయాన సంస్థల ఉద్యోగులపై భారీగా పడుతోంది.

1200 మంది సీనియర్ గ్రేడ్ ఉద్యోగులకు.. విస్తారా షాక్..
Follow us on

కోవిద్-19 మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. లాక్ డౌన్ నేపథ్యంలో విమానయాన సంస్థల ఆదాయాలు భారీగా పడిపోయాయి. ఈ ప్రభావం ఆయా విమానయాన సంస్థల ఉద్యోగులపై భారీగా పడుతోంది. తాజాగా విస్తారా తమ ఉద్యోగులకు మరోసారి షాకిచ్చింది. సీనియర్ గ్రేడ్ ఉద్యోగులను 3 రోజులపాటు నిర్బంధ సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. జీతంలేని తప్పనిసరి సెలవు తీసుకోవాల్సిందిగా దాదాపు 1200 మంది సీనియర్లను కోరింది. నగదు కష్టాలను ఎదుర్కొంటున్న సంస్థ జీతం లేకుండా సెలవుపై వెళ్ళమని విస్తారా ఉద్యోగులను కోరడం ఇది రెండోసారి.

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ పొడిగించారు. ఈ క్రమంలో కార్యకలాపాలన్నింటినీ నిలిపివేశామనీ, ఇది తమ నగదు లభ్యతపై గణనీయంగా ప్రభావం చూపిందని ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌ సమాచారంలో విస్తారా సీఈవో లెస్లీ థంగ్ తెలిపారు. ఈ సెలవు నుంచి 2800 మంది ఉద్యోగుల (క్యాబిన్, గ్రౌండ్ సర్వీసు)కు మినహాయింపు నిచ్చింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా విధించిన 21 రోజుల లాక్ డౌన్ నిబంధనలను మే 3వ తేదీ వరకు కేంద్రం పొడిగించింది. కరోనా ముప్పు కారణంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి విదితమే.