హైదరాబాద్‌ నుంచి గంటలో వైజాగ్‌కు వెళ్లిపోవచ్చు…!

హైదరాబాద్‌ నుంచి గంటలో వైజాగ్‌కు వెళ్లిపోవచ్చు...!

ఇప్పుడు దూరం భారం కాదు.. ఎందుకంటే హైపర్‌లూప్‌ వచ్చేస్తోంది కాబట్టి.. విమానాల అంత వేగంతో నేల మీద ప్రయాణించే హైపర్‌లూప్‌ రైటు ప్రయాణం సక్సెస్‌ అయ్యింది..

Balu

|

Nov 10, 2020 | 11:13 AM

ఇప్పుడు దూరం భారం కాదు.. ఎందుకంటే హైపర్‌లూప్‌ వచ్చేస్తోంది కాబట్టి.. విమానాల అంత వేగంతో నేల మీద ప్రయాణించే హైపర్‌లూప్‌ రైటు ప్రయాణం సక్సెస్‌ అయ్యింది.. సాధారణ ప్రజానీకం అందులో ప్రయాణించే రోజు ఎంతో దూరంలో లేదు.. హైపర్‌లూప్‌ అంటే కృత్రిమ సొరంగ మార్గంలో నడిచే రైలే..! ఇంత కాలం ప్రయోగాలకే పరిమితమైన ఆ రవాణా వ్యవస్థ తొలిసారి ప్రయాణికులతో నడిపారు.. సక్సెసయ్యారు.. అమెరికాలోని లాస్‌వెగాస్‌ నగరంలోని డెవ్‌లూప్‌లో ఈ ప్రయోగం జరిగింది. రిచర్స్‌ బ్రాన్సన్‌కు చెందిన వర్జిన్‌ గ్రూప్‌ మొదటి సారి హైపర్‌లూప్‌ రైలును నడిపించింది.. గతంలో 400 సార్లు హైపర్‌లూప్‌ రైల్‌ ట్రయల్స్‌ను నిర్వహించినప్పటికీ ప్రయాణికులతో నడపడం మాత్రం ఇదే ప్రథమం.. హైపర్‌లూప్‌ అనేది లేటెస్ట్‌ రవాణా వ్యవస్థ.. గంటలకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సాగించవచ్చు.. ఈ రైలులో బోగీలకు బదులు క్యాప్స్యుల్స్‌ ఉంటాయి.. భూగర్భంలోనే ఉండాలన్న రూలేమీ లేదు.. స్తంభాలపై కూడా హైపర్‌లూప్‌ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు.. ఎలాంటి ప్రమాదాలకు తావు లేదు. నిర్భయంగా ఇందులో ప్రయాణం చేయవచ్చు. రైలు మార్గాన్ని ట్యూబ్‌ అంటారు.. అంటే దీన్ని మనం ట్యూబ్‌ ట్రయిన్‌ అని పిల్చుకోవచ్చు.. మొన్న హైపర్‌లూప్‌ చీఫ్‌ టెక్రాలజీ ఆఫీసర్‌ జోష్‌ జోజెల్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్యాసింజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సారా లుచియాన్‌లు తొలిసారి హైపర్‌లూప్‌లో ప్రయాణించిన వారుగా రికార్డు సాధించారు. ఇప్పుడీ ట్యూబ్‌ ట్రయిన్‌ గంటకు 600 మైళ్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నా ప్రయాణికులతో నడుపుతున్నారు కాబట్టి గంటలకు వంద మైళ్ల వేగంతో నడిపి చూశారు.. ఈ ట్యూబ్‌ రైలు జస్ట్‌ 15 సెకన్లలోనే 0.3 మైళ్లు దూసుకెళ్లింది.. ఇండియాలో కూడా హైపర్‌లూప్‌ రవాణా వ్యవస్థ త్వరలో రాబోతున్నది.. పూణెను ముంబాయితో అనుసంధానించేందుకు ప్రస్తుమున్న ఎక్స్‌ప్రెస్‌ హైవే పక్కనే హైపర్‌లూప్‌ మార్గాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు వర్జిన్‌ హైపర్‌లూప్‌ ఎండీ హర్జ్‌ ధలివాల్‌..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu