ధోని రిటైర్మెంట్ వట్టి పుకార్లే.. సాక్షి గుస్సా!

ధోని రిటైర్మెంట్ వట్టి పుకార్లే.. సాక్షి గుస్సా!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇవాళ ఉదయం ధోనిని ఉద్దేశించి షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్లు ధోని రిటైర్మెంట్ గురించి ఇప్పటికే కోహ్లీకి చెప్పేసి ఉంటాడని అనుకుంటున్నారు. ఇక కోహ్లీ షేర్ చేసిన పోస్ట్ విషయానికి వస్తే.. 2016 టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ధోనితో కలిపి ఎలా ఛేదించాం అనేది ఫ్యాన్స్‌తో కోహ్లీ పంచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో […]

Ravi Kiran

|

Sep 12, 2019 | 7:45 PM

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇవాళ ఉదయం ధోనిని ఉద్దేశించి షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్లు ధోని రిటైర్మెంట్ గురించి ఇప్పటికే కోహ్లీకి చెప్పేసి ఉంటాడని అనుకుంటున్నారు. ఇక కోహ్లీ షేర్ చేసిన పోస్ట్ విషయానికి వస్తే.. 2016 టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ధోనితో కలిపి ఎలా ఛేదించాం అనేది ఫ్యాన్స్‌తో కోహ్లీ పంచుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ఫిట్‌నెస్ టెస్ట్ మాదిరిగా.. తనను పరిగెత్తించాడని కోహ్లీ ధోనిని ఉద్దేశించి చమత్కరించాడు. అంతేకాకుండా ధోనితో ఉన్న మధురస్మృతిని గుర్తు చేసుకున్నాడు.

దీనితో నెటిజన్లు అందరూ కూడా #Dhoni హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తుండగా.. ఇవాళ రాత్రి 7 గంటలకు ధోని ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు అని చెబుతూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్లు.. ఒకవేళ అదే జరిగితే ఈరోజు క్రికెట్‌కు బ్లాక్ డే అని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం ధోని ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టరని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ విషయంపై స్పందిస్తూ ధోని వైఫ్ సాక్షి ట్విట్టర్ వేదికగా అవన్నీ వట్టి రూమర్స్ అని కొట్టి పారేశారు.

ఇది ఇలా ఉండగా బీసీసీఐ సెలక్షన్ కమిటి ఇవాళ సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు టీం‌ను సెలెక్ట్ చేసింది. ఎప్పటిలానే ధోని రిటైర్మెంట్ విషయం గురించి ప్రస్తావించగా.. ఎప్పుడూ పాడే పాత పాటను వారు అందుకోవడం జరిగింది. ధోని రిటైర్మెంట్‌పై వచ్చేవన్నీ వట్టి రూమర్లేనని.. అసలు ధోని తమ దగ్గర ఇలాంటి ప్రస్తావన తీసుకురాలేదని వ్యక్తం చేశారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu