Viral Video: అమ్మప్రేమకు సాటి లేదు ఇలలో.. ఎలుగుబంటిని హగ్ చేసుకోబోయిన చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడిన తల్లి

వాషింగ్టన్‌లోని ఓ ఇంటి వెనుక గోడపైనుంచి దూకి ఇంట్లోకి చొరబడబోయింది ఒక ఎలుగు బంటి. ఆ ఇంట్లో డోర్‌ దగ్గర నిలబడి ఉన్న చిన్నారి దానిని చూసి ముచ్చటపడి హగ్‌ చేసుకోడానికి దాని దగ్గరకు వెళ్లబోయింది.

Viral Video: అమ్మప్రేమకు సాటి లేదు ఇలలో.. ఎలుగుబంటిని హగ్ చేసుకోబోయిన చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడిన తల్లి
Viral Video

Updated on: May 29, 2022 | 12:37 PM

Viral Video: అమ్మప్రేమకు ఇలలో సాటి మరేదీ రాదు. తల్లి తన పిల్లల పై చూపించే ప్రేమ, వారి క్షేమం కోసం పడే తన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఇప్పటికే ప్రపంచంలో అమ్మప్రేమ గురించి అనేక వార్తలు వింటూనే ఉన్నాం.. తాజాగా తనకెంతో ఇష్టమైన జంతువు కళ్లముందు కనిపించగానే ఆ చిన్నారి దానిని హగ్‌ చేసుకోవాలనుకుంది. అది క్రూర జంతువు అని తెలియక అభం శుభం తెలియని ఆ చిన్నారి దాని వద్దకు పరుగెత్తింది. దూరం నుంచి అది గమనించిన చిన్నారి తల్లి పరుగెత్తుకుంటూ వచ్చి తన బిడ్డను కాపాడుకుంది. ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటన అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

వాషింగ్టన్‌లోని ఓ ఇంటి వెనుక గోడపైనుంచి దూకి ఇంట్లోకి చొరబడబోయింది ఒక ఎలుగు బంటి. ఆ ఇంట్లో డోర్‌ దగ్గర నిలబడి ఉన్న చిన్నారి దానిని చూసి ముచ్చటపడి హగ్‌ చేసుకోడానికి దాని దగ్గరకు వెళ్లబోయింది. వెంటనే ఆ చిన్నారి తల్లి అప్రమత్తమై ప్రాణాలకు తెగించి బిడ్డ ఎత్తుకొని ఇంట్లోకి పరుగెత్తి డోర్‌ లాక్‌ చేసింది. ఈ ఘటన అంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియోను సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేయగా వైరల్‌గా మారింది.

 

ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షిస్తున్నారు. ఆ తల్లి సాహసానికి నెటిజన్లు హీరో మామ్‌ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా, త‌న కూతురు ఇటీవ‌లే యానిమ‌ల్ బుక్ చ‌దివింద‌ని, త‌న ఫేవ‌రెట్ యానిమ‌ల్ ఎలుగుబంటి అని చెప్పింద‌ని ఆ త‌ల్లి తెలిపింది. క్రూర జంతువుల గురించి త‌న‌కూతురికి వివ‌రిస్తాన‌ని చెప్పింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Follow Us