Viral Video: పెంపుడు జంతువులు కుక్కలు, పిల్లులు చేసే పనులు వీడియోలైనా ఫోటోలు అయినా ఎంతగా నెటిజన్లను ఎంతగా ఆకట్టుకుంటాయో.. ఏనుగుల వీడియోలు కూడా అంతగానే ఆకట్టుకుంటాయి. ఇక భారతీయులకు ఏనుగులకు అవినాభావ సంబంధం ఉంది. హిందువులు ఏనుగులకు పూజిస్తారు. పూర్తిగా శాఖాహారులైన ఏనుగులు మంచి తెలివైనవి.. అందుకనే వీటిని భారతీయులు మచ్చిక చేసుకుని అనేక పనులను కూడా చేయించుకుంటారు.
భూమి మీద నివసించే జంతువులలో అతి పెద్దవైన ఏనుగులు కష్టపడి పనిచేస్తాయి. అంతేకాదు ఎక్కువగా గుంపులు గుంపులుగా నివసించడానికి ఇష్టపడతాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అందులో ఓ ఏనుగుల గుంపు.. నదిని దాటి వెళ్తున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని కొన్ని ఏనుగులు ముందు దాటేశాయి. మిగిలిన తమ సహచర ఏనుగులు తమ వద్దకు రావడం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇంతలో ఓ గున్న ఏనుగు.. నది దాటడానికి నదిలోకి దిగింది. నీటి ఉధృతిని తట్టుకోలేని ఆ బుల్లి ఏనుగు.. నది ఒరవడికి కొట్టుకుని పోతుంటే.. వెంటనే మరో ఏనుగు.. ఆ పిల్ల ఏనుగు దగ్గరకు వెళ్లి.. తన తొండంతో అడ్డు పడింది. గున్న ఏనుగును ఒడ్డుకు తీసుకుని రావడానికి కష్టపడుతుంది. ఇది ఒడ్డున ఉన్న ఏనుగులు చూశాయి. తిరిగి నీటిలోకి దిగి.. గున్న ఏనుగుని ఒడ్డుకు తీసుకుని రావడానికి ఏనుగుకు సాయం చేసింది. దీంతో గున్న ఏనుగు క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది. ఈ వీడియో ఇదీ ఉమ్మడి కుటుంబంలోని విశిష్టత అంటూ సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో ఒకరికి కష్టం వస్తే.. మిగితా ఫ్యామిలీ మొత్తం సాయం చేసి.. ఆ కష్టం నుంచి గట్టెకించేవారంటూ గుర్తు చేసుకున్నారు.
Also Read: కూచిపూడి క్లాసెస్ కు వెళ్ళడం ఇష్టంలేక బలవంతంగా ప్రాణం తీసుకున్న బాలిక..