AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: కూచిపూడి క్లాసెస్ కు వెళ్ళడం ఇష్టంలేక బలవంతంగా ప్రాణం తీసుకున్న బాలిక..

AP Crime News: పిల్లల ఇష్టాఇష్టాలు అభిరుచిని పెద్దలు గౌరవించాలి. నేటి జనరేషన్ చాలా చిన్న చిన్న విషయాలకు తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటూ క్షణికావేశంలో..

AP Crime News: కూచిపూడి క్లాసెస్ కు వెళ్ళడం ఇష్టంలేక బలవంతంగా ప్రాణం తీసుకున్న బాలిక..
Dance Classes
Surya Kala
|

Updated on: Oct 20, 2021 | 11:08 AM

Share

AP Crime News: పిల్లల ఇష్టాఇష్టాలు అభిరుచిని పెద్దలు గౌరవించాలి. నేటి జనరేషన్ చాలా చిన్న చిన్న విషయాలకు తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటూ క్షణికావేశంలో తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. తాజాగా ఓ బాలిక నృత్యం నేర్చుకోవడం ఇష్టం లేక.. డ్యాన్స్ క్లాసులకు వెళ్ళడం ఇష్టం లేకపోవడంతో ఏకంగా ప్రాణాలను తీసుకుందని పోలీసులు చెప్పారు.

విశాఖ పట్నం జిల్లా దొండపర్తిలో సోమవారం రాత్రి ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేశారు. బాలిక చదువుకుంటున్న స్కూల్ కు వెళ్ళిన పోలీసులు ఎంక్వైరీ చేశారు. బాలిక విద్యనభ్యసించే విధానంపై, ఇంట్లో ప్రవర్తనపై ఆరా తీశారు. బాలిక ఓ సాంప్రదాయ నాట్యశాలలో కూచిపూడి నేర్చుకునేది. అయితే ఆ బాలికకు కూచిపూడి అంటే ఇష్టం లేదని.. కానీ తల్లిదండ్రుల కోసం ఇష్టం లేకున్నా అయిష్టంగా డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తుండేదని పోలీసులు చెప్పారు. ఇక కోవిడ్ కల్లోలం నుంచి డ్యాన్స్ క్లాసెస్ ను ఆన్‌లైన్‌ లో అభ్యసించేది. అయితే అక్టోబర్ 20 నుంచి కూచిపూడి క్లాసెస్ మళ్ళీ మొదలుకానున్నాయని.. తెలియడంతో .. వెళ్ళడం ఇష్టంలేక.. తీవ్రంగా అలోచించి.. సోమవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పారు. ఇప్పటికే బాలిక మృత దేహానికి పోర్ట్ మార్టం పూర్తి చేశామని.. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించామని పోలీసులు చెప్పారు. బాలిక బలవంతంగా మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read: Cranberry Juice: మూత్రనాళ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడేవారికి దివ్య ఔషధం.. క్రాన్‌బెర్రీ జ్యూస్ అంటున్న వైద్యులు..