వరంగల్‌లో రాములమ్మ అరెస్ట్..

ఇంటర్ బోర్డు అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా నేడు పలు చోట్ల పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌లో జరిగిన ఆందోళనలో సినీ నటి, పార్టీ నేత అయిన విజయశాంతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, తదితరులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు నిర్వాకాన్ని దుయ్యబట్టిన విజయశాంతి.. ఇంటర్ ఫలితాల అవకతవకలపై విద్యార్థిలోకం ఇంతగా ఆందోళన […]

వరంగల్‌లో రాములమ్మ అరెస్ట్..

Edited By:

Updated on: Apr 25, 2019 | 6:41 PM

ఇంటర్ బోర్డు అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా నేడు పలు చోట్ల పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌లో జరిగిన ఆందోళనలో సినీ నటి, పార్టీ నేత అయిన విజయశాంతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, తదితరులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు నిర్వాకాన్ని దుయ్యబట్టిన విజయశాంతి.. ఇంటర్ ఫలితాల అవకతవకలపై విద్యార్థిలోకం ఇంతగా ఆందోళన చేస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆమె.. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.