పార్లమెంటరీ స్థాయి సంఘాలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. వివిధ శాఖలకు ఛైర్మన్లు, సభ్యులను నియమించినట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది.
ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కూడా ఛైర్మన్ పదవులు దక్కాయి. కాగా, ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి కీలక పదవి దక్కింది. వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా విజయసాయిరెడ్డిని నియమించారు. ఈ కమిటీలో మాగుంట శ్రీనివాసులురెడ్డి, నామా, కేశినేని నానిని సభ్యులుగా ఉన్నారు. ఇక పరిశ్రమల వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎంపీ కేశవరావును నియమించారు. పరిశ్రమల వ్యవహారాల పార్లమెంటరీ సభ్యుడిగా అవినాష్ రెడ్డిని నియమిస్తున్నట్లు ఓం బిర్లా తెలిపారు. ఇదిలా ఉంటే.. రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖల స్థాయి సంఘం చైర్మన్‌గా టీజీ, పార్లమెంట్ వ్యవహారాల ఆర్థికశాఖ సభ్యులుగా మిథున్‌రెడ్డి, సీఎం రమేష్‌ను నియమిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఢిల్లీలో కీలక పదవులు వరించడం విశేషం.
ఇక పెట్రోలియం స్థాయి సంఘం ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ రమేశ్ బిధురి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్థాయి సంఘానికి ఛైర్మన్‌గా కాంగ్రెస్ నేత శశిథరూర్‌ను నియమించారు. హోం వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ, రక్షణ వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా బీజేపీ నేత జోయల్ ఓరం, విదేశీ వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా బీజేపీ సీనియర్ నేత పి.పి చౌదరి, అందులో సభ్యుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం నియమితులయ్యారు. గతంలో చిదంబరం హోం వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా వ్యవహరించారు. రైల్వే వ్యవహారాల స్థాయి సంఘానికి రాధామోహన్ సింగ్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఎరువులు, రసాయనాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా డీఎంకే ఎంపీ కనిమొళి నియమితులయ్యారు. స్థాయి సంఘంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, అభిషేక్ మనుసింఘ్వి సభ్యులుగా ఉన్నారు.