Vidura Niti: రాజ్యాధికారం నిలవాలంటే.. సప్తవ్యసనాలను, పుత్రులపై ప్రేమని వదలాలంటున్న విదుర నీతి

Vidura Niti-Mhabharata:  మనిషి జీవితానికి, సమాజానికి ఉపయోగపడే నీతులు, మార్గదర్శకాలను పురాణాలు, వేదశాస్త్రాలతో పాటు విదురనీతి, చాణక్యనీతి వంటివి తెలుపుతాయి..

Vidura Niti: రాజ్యాధికారం నిలవాలంటే.. సప్తవ్యసనాలను, పుత్రులపై ప్రేమని వదలాలంటున్న విదుర నీతి
Vidura Niti
Follow us

|

Updated on: Oct 03, 2021 | 9:27 AM

Vidura Niti-Mhabharata:  మనిషి జీవితానికి, సమాజానికి ఉపయోగపడే నీతులు, మార్గదర్శకాలను పురాణాలు, వేదశాస్త్రాలతో పాటు విదురనీతి, చాణక్యనీతి వంటివి తెలుపుతాయి. ఇక ఒక దాసికి, వ్యాసుడికి జన్మించిన విదురుడు.. ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరుతూ ఉండే కృష్ణభక్తుడు. విదురుడు చెప్పిన నీతులు నేటి మానవునికి అనుచరణీయం. ధృతరాష్ట్రుడి కొలువులో మంత్రిగా ఉన్న విదురుడు మహారాజైన ధృతరాష్ట్రుడికి పుత్రులను ఎలా పెంచాలి, రాజా ధర్మం, వంటి అనేక విషయాలను తెలిపాడు.. ఈరోజు తండ్రి పుత్రుల మీద గుడ్డిప్రేమతో వారు ఏమి చెబితే అది కరెక్ట్ అన్నట్లు భావిస్తే.. ఎటువంటి అనర్ధాలను ఎదుర్కోవాలో చెప్పిన నీతి గురించి తెలుసుకుందాం..

ఇంద్రియ విషయ సుఖములకు లోబడినవారు తపస్సు చేయలేరు. పరమాత్మ సుఖాన్ని అనుభవించలేదు. శారీరక సుఖం కోసం ఆలోచించని ధీరులు మాత్రమే ఏకాగ్ర చిత్తంతో దైవ సామ్రాజ్య పట్టాభిషిక్తులవుతారు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని, మనస్సును చెదరిపోనీక, వికారములు పొందినపుడు చక్కగా శిక్షించుచు, పరీక్షించి పనులు చేయు ధీరుని ఎప్పటికీ లక్ష్మీదేవి విడిచి వెళ్ళదు. అంతేకాని నిగ్రహము లేని నీవు కొడుకులు ఆడించినట్లు ఆడుయున్నావు.. కనుక దృతరాష్ట్ర నీ దగ్గర లక్ష్మి దేవి నిలవదని విదురుడు చెప్పాడు.

రాజా! పురుషునకు.. అంటే పురుషుడు అంటే శరీరం కలవాడని జీవి అని అర్ధం.. శరీరము రథం, మనస్సును, వశమైన ఇంద్రియాలు..  దానికి గుర్రాలు. ఏమరు పాటు లేకుండా నేర్పుగలవాడై తనకు లొంగిన ఆ మంచి గుర్రములతో ధీరుడు రథికుని వలె సుఖంగా ప్రయాణిస్తాడు.ఆకాశం లోనికి ఎవరైనా బూడిదను ఎగురవేస్తే అది వచ్చి వారి తలమీదనే పడుతుంది కదా.. అదే విధంగా  సాధువులను ఎవరు నిందిస్తారో.. వారు తమను తామే దూషించుకొనేవారుగా పరిగణింపబడతారు.

అధములకు బ్రతుకుతెరువు లేదనే భయం, మధ్యములకు చావు భయం. ఉత్తమమైన నరులకు అవమానాలంటే మహాభయం. త్రాగుడు, మదం మొదలగు మదంలన్నింట్లో ఐశ్వర్య మదం అన్నింటికన్న మిన్న. ఐశ్వర్యంతో పొగరెక్కినవాడు మొత్తం పతనం చెందిన తర్వాత కానీ తన తప్పుని తెలుసుకోడు. ఐశ్వర్యం, ధనం, అధికారం వలన  కలిగిన మదం..  తక్కిన పాపములకెల్ల మించిన పాపమని తెలుసుకోవాలి. పరస్త్రీ వ్యామోహం, జూదం, తాగుడు, వేట, కఠినంగా మాట్లాడటం, కఠినంగా ప్రవర్తించడం, డబ్బుతో చేసే పాపాలు ఇవి సప్తవ్యసనాలుగా మన పెద్దలు పరిగణీంచారు. వ్యసనం మానవునికి మనసు అదుపులో లేకపోవడం వల్లనే వస్తుంది. ఈ సప్తవ్యసనాల వల్ల మానవుని జీవితం నశించిపొయిన వారి గురించిన కథలు చరిత్రలో ఎన్నెన్నో ఉన్నాయని విదురుడు చెప్పాడు. అందుకనే రాజు దగ్గర రాజ్యలక్ష్మి ఎల్లప్పుడూ ఉండాలంటే.. ఈ సప్తవ్యసనాలను వదిలించుకోవాలని సూచించాడు.  మనిషికి ప్రతికూల పరిస్థితులు, చెడు అనుభవాలు ఎదురవుతాయి. విజ్ఞులైనవారు ఈ అనుభవాల నుంచి కొన్ని సందేశాలు నేర్చుకుంటారు. ప్రతీ అనుభవం ఒక పాఠంలా భావించి ముందుకు వెళ్ళాలి. అనుభవం వల్ల కలిగిన పాఠం మాత్రం మనసులో గాఢంగా ముద్ర వేస్తుంది. అది జీవన మార్గాన్ని నిర్దేశిస్తుంది. మనిషి వ్యక్తిత్వాన్ని పటిష్ఠం చేసి అతడిని ఉన్నతుడిగా తీర్చిదిద్దుతుంది.

Also Read: Pitru Paksha: పూర్వీకులు చేసిన పాపాలు ప్రస్తుత తరంకు శాపాలా .. అవి పోవాలంటే ఈరోజు ఏం చేయాలంటే..