
ఐఐటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలలో పరిశోధనలు సమాజానికి సంబంధించినవి కావాలని, వాతావరణ మార్పుల నుండి ఆరోగ్య సమస్యల వరకు మానవజాతి ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు ఈ రోజు ఉద్ఘాటించారు. ఐఐటీ ఢిల్లీ వజ్రోత్సవంలో ఉపరాష్ట్రపతి ఆన్ లైన్ ద్వారా పాల్గొన్నారు. 60 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆచార్యులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. డైమండ్ జూబ్లీ లోగోను ఆవిష్కరించిన ఆయన.. 2030 ప్రణాళికలతో కూడిన డాక్యుమెంట్‌ను కూడా విడుదల చేశారు.
సామాజిక సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంపై దృష్టి సారించే ఆర్‌అండ్‌డి ప్రాజెక్టులలో ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ఢిల్లీ ఐఐటీ ఒకటని తెలిపారు. దేశ నిర్మాణంలో ఐఐటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. నూతన ఆవిష్కరణలు చేయడంలో యువతకు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నారు. కొత్త విద్యా విధానంతో విశ్వగురువు స్థానంలో భారత్ పునఃప్రతిష్ఠితం కానుందని తెలిపారు.
Read More: