వాస్తు శాస్త్రం: ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఇంటి టెర్రస్ లేదా పైకప్పుపై పక్షులకు ధాన్యం, నీరు పెట్టడం చాలా పుణ్య కార్యంగా భావిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, పైకప్పుపై పక్షులకు నేరుగా ఆహారం వేయడం వల్ల కొన్నిసార్లు వాస్తు దోషాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి, పక్షులకు ఆహారం అందించాలనుకునే ఎటువంటి నియమాలు పాటించాలి..? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో తప్పక తెలుసుకోవాలి.

మన దేశంలో మూగజీవాలకు, ముఖ్యంగా పక్షులకు గింజలు, నీరు పెట్టడం ఎంతో పుణ్య కార్యంగా, జాలి గుణానికి నిదర్శనంగా భావిస్తాము. చాలా మంది తమ ఇంటి టెర్రస్ లేదా పైకప్పుపై రోజూ ఉదయం బియ్యం, ధాన్యం లేదా ఇతర ఆహార పదార్థాలను చల్లుతుంటారు. అయితే, వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పుపై పక్షులకు ఆహారం వేయడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని మీకు తెలుసా? దీని గురించి వాస్తు నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఇంటి పైకప్పుపై ధాన్యం వేయడం వల్ల వచ్చే సమస్యలు:
వాస్తు దోషాలు: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి పైకప్పు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. అక్కడ ధాన్యం వేయడం వల్ల పక్షులు విసర్జించే వ్యర్థాలు మరియు చెల్లాచెదురైన గింజల కారణంగా పైకప్పుపై అశుభ్రత పేరుకుపోతుంది. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది.
గ్రహ దోషాలు: పైకప్పుపై ధాన్యం చెల్లాచెదురుగా పడటం వల్ల జ్యోతిష్య శాస్త్రంలో అశుభ గ్రహాలుగా భావించే శని, రాహువుల ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. దీనివల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మానసిక అశాంతి ఏర్పడే అవకాశం ఉంది.
ఆరోగ్య సమస్యలు: పక్షులు వచ్చి ఆహారం తిని వెళ్లిన తర్వాత అక్కడ మిగిలిపోయిన చెత్తాచెదారం వల్ల ఈగలు, దోమలు పెరిగి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి.
పక్షులకు ఆహారం వేయడానికి సరైన, వాస్తు ప్రకారం సరైన పద్ధతి ఏమిటి?
పక్షులకు సేవ చేయడం మంచిదే అయినప్పటికీ, దాన్ని సరైన పద్ధతిలో చేయడం ముఖ్యం. ధాన్యాన్ని ఎప్పుడూ ఇంటి ప్రధాన పైకప్పుపై నేరుగా చల్లకూడదు. బదులుగా, బాల్కనీలో లేదా పెరట్లో ఒక ప్రత్యేకమైన గిన్నె లేదా హ్యాంగింగ్ ఫీడర్ ఏర్పాటు చేసి అందులో గింజలు పోయాలి. పక్షుల దాహం తీర్చడానికి మట్టి పాత్రలో స్వచ్ఛమైన నీటిని ఉంచడం చాలా శ్రేయస్కరం. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకొస్తుం. వాస్తు దోషాలను నివారిస్తుంది. కాబట్టి, మూగజీవాలపై మీకున్న దయను కొనసాగిస్తూనే, వాస్తు నియమాలను పాటించడం ద్వారా మీ ఇంటిలో సుఖశాంతులను కాపాడుకోవచ్చు.




