ఏంటి బావా పెళ్ళంటా…?
టాలీవుడ్‌లో పెళ్లి సందడి మొదలైంది. ఒకరి తర్వాత మరొకరు వరుసగా పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటి వాడయ్యాడు.

టాలీవుడ్‌లో పెళ్లి సందడి మొదలైంది. ఒకరి తర్వాత మరొకరు వరుసగా పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటి వాడయ్యాడు. లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ పల్లవి శర్మను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. అదే బాటలో టాలీవుడ్ మోస్ట్ బ్యాచులర్ లిస్ట్‌లో ఒకడైన రానా దగ్గుబాటి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇన్ని రోజులు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా మంది తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. అయితే ఇటీవల నాగబాబు తన పిల్లల పెళ్ళి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. నిహారిక, వరుణ్ తేజ్‌ల పెళ్లి త్వరలోనే చేస్తానని చెప్పుకొచ్చారు.
నాగబాబు చెప్పిన విషయాన్ని మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఇదే విషయంపై డైరెక్ట్‌గా వరుణ్ తేజ్‌కి ట్వీట్ చేశాడు సాయిధరమ్ తేజ్. . ఏంటి బావ ? నీకు పెళ్లంటా అని… ఈ ప్రశ్నకు అంతే వేగంగా స్పందించాడు వరుణ్… దానికి ఇంకా చాలా టైమ్ ఉందిలే కానీ.. మన రానా, నితిన్ మాత్రం ఎప్పటికీ మనందరం కలిసే ఉంటాం అంటూనే సింపుల్ గా సింగిల్ గ్రూప్ నుంచి మాయమయ్యాడు” అంటూ వ్యాఖ్యానించారు. ఇదే టాపిక్‌పై జోరుగా ట్వీట్‌లు కొనసాగుతున్నాయి.
Enti bava @IAmVarunTej neeku pellanta? ??? pic.twitter.com/0jEWbDe5PU
— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 23, 2020