సిక్కిం చిన్నది ఆదాశర్మ కొత్త సినిమాకి టైటిల్ కన్ఫాం అయింది. ‘?’ (క్వశ్చన్ మార్క్) అనే టైటిల్ ఖరారు చేశారు మూవీ టీం. దీనికి సంబంధించి ఇవాళ టైటిల్ లోగోని రిలీజ్ చేశారు. ఆదాశర్మ లీడ్ రోల్ ప్లే చేస్తోన్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి విప్రా దర్శకత్వం వహిస్తున్నారు. గౌరీకృష్ణ నిర్మాత. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తమ సినిమాకి ఈ టైటిల్ కరెక్ట్ గా సరిపోతుందనే పెట్టామని ఆదా చెప్పింది. కరోనా కాలంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని షూటింగుని పూర్తిచేశామని ఎక్కువ భాగం హైదరాబాదు పరిసరాల్లోనే షూట్ చేశామని దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఆదా తెలుగుతోపాటు హిందీలో వెబ్ సీరిస్ సినిమాల్లో నటించి మెప్పించింది.