Poornam boorelu: అమ్మవారికి నైవేధ్యంగా ఆంధ్రా స్టైల్‌లో తియ్యతియ్యటి పూర్ణం బూరెలు.. తయారీవిధానం

Varalakshmi Vratam Special Poornam boorelu recipe: శ్రావణ మాసం వస్తూ ప్రతి ఇంట్లో సందడి తెస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లతో ఈ నెలంతా కళకళాడిపోతుంది. మంగళ గౌరీ వ్రతం, శ్రావణ..

Poornam boorelu: అమ్మవారికి నైవేధ్యంగా ఆంధ్రా స్టైల్‌లో తియ్యతియ్యటి పూర్ణం బూరెలు.. తయారీవిధానం
Purnam Burelu
Follow us
Surya Kala

|

Updated on: Aug 19, 2021 | 2:12 PM

Varalakshmi Vratam Special Poornam boorelu recipe: శ్రావణ మాసం వస్తూ ప్రతి ఇంట్లో సందడి తెస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లతో ఈ నెలంతా కళకళాడిపోతుంది. మంగళ గౌరీ వ్రతం, శ్రావణ శుక్రవారం వ్రతం ఆచరిస్తూ మహిళలు నిండుదనాన్ని తెస్తారు. మొత్తానికి శ్రావణ శోభకు నిండుదనం తెస్తుంది వరలక్ష్మీ వ్రతం. లక్ష్మీదేవి అనుగ్రహం కోరుతూ మహిళలు వ్రతాలు ఆచరిస్తారు. యధాశక్తిని లక్ష్మీదేవిని పూజించి తమని ఆశీర్వదించమని కోరుతూ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. మరి శ్రావణ శుక్రవారం రోజున తియ్యటి పూర్ణం బూరెలు.. పుల్లపుల్లగా, కారంకారంగా పులిహోర.. పాల నురగ లాంటి దద్దోజనం.. నోరూరించే బెల్లం పరమాన్నం వంటి ఆహారదార్ధాలతో పాటు శనగలు, చలిమిడి వంటివాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తియ్యటి పూర్ణాల తయారు విధానం తెలుసుకుందాం..

పూర్ణం బూరెలకు కావాల్సిన పదార్ధాలు:

బియ్యం, మినప్పప్పు, శనగపప్పు, బెల్లం- కప్పు చొప్పున యాలకులు- అయిదారు, నెయ్యి- తగినంత, వంటసోడా- పావు చెంచా, ఉప్పు- తగినంత.

తయారీ విధానం:

ముందుగా మినపప్పు , బియ్యం కలిపి దోశపిండిలా కలిపి కొన్ని గంటలపాటు నానబెట్టాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, వంటసోడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అలాగే విడిగా శననగపప్పును కూడా నానబెట్టుకోవాలి. శనగపప్పు నానిన తర్వాత సరైన పాళ్లలో మరిన్ని నీళ్లు కలిపి పప్పు మెత్తబడకుండా పలుకులుగా ఉడికించాలి. శనగపప్పు ఉడికిన తర్వాత అందులోని నీరుని ఒంపెయ్యాలి.

నీరు తీసేసిన శనగపప్పులో బెల్లం, యాలకులను వేసుకుని మిక్సీ చేసుకోవాలి. దీనిని పూర్ణం అంటారు. ఈ పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఓ పక్కకి పెట్టుకోవాలి. కొంతమంది ఈ పూర్ణంలో పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు ముక్కలను కూడా కలిపి.. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పెడతారు.

ఇంతలో గ్యాస్ స్టౌ పై బాణలి పెట్టుకుని నూనె వేసి వేడి చేయాలి. అనంతరం ఈ పూర్ణం ఉండలను తీసుకుని.. మినపపిండి, బియ్యప్పిండి మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఈ బూరెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ వేడివేడి బూరెల మధ్యలో సొట్ట చేసి ఆవు నెయ్యి వేసుకుని తింటే.. ఆహా ఏమి రుచి అనరామైమరచి.

Also Read:  తెలంగాణలో పది ఉత్తీర్ణులైన మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్