పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ‘వకీల్‌సాబ్’ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. రాజకీయాల్లోకి వెళ్లి దాదాపు మూడేళ్ల విరామం అనంతరం ‘వకీల్‌సాబ్’ తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు పవన్. హిందీ ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు వేణు శ్రీరామ్ తెలుగుకు అనుగుణంగా మార్పులు చేశారు. ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. తాజాగా ఈ చిత్ర ఓటీటీ విడుదల తేదీ గురించి అమెజాన్ ప్రైమ్ ప్రకటన చేసింది. ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.
In the hall of justice, he will turn black to white.
New trailer out now!Meet #VakeelSaabOnPrime on April 30. @PawanKalyan #SriramVenu @shrutihaasan @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @SVC_official @MusicThaman @bayviewprojoffl @BoneyKapoor pic.twitter.com/uz0tjoYHAR
— amazon prime video IN (@PrimeVideoIN) April 27, 2021
ఈ సినిమాను 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్‌రాజు స్పష్టం చేశారు. కానీ థియేటర్లు మూతపడటం వల్ల కొంచెం ముందుగానే రిలీజ్ చేయాలని నిర్ణయించింది మూవీ యూనిట్. కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించగా.. ప్రధాన పాత్రల్లో ప్రకాశ్ రాజ్, నివేథా థామస్, అంజలి, అనన్య నాగళ్ల నటించారు.
Also Read: మెగాస్టార్ సినిమాకు తప్పని కరోనా కష్టాలు.. వాయిదా పడిన ‘ఆచార్య’.. అఫిషియల్‌గా ప్రకటించిన మేకర్స్..