AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వైభవ్ ఔటయ్యాక చుట్టుముట్టి పాక్ ప్లేయర్ల రచ్చ.. ఆ తర్వాత అభిషేక్ ఏం చేశాడంటే?

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో ఇండియా ఎ వర్సెస్ పాకిస్తాన్ ఎ మ్యాచ్‌లో ఉద్రిక్తత నెలకొంది. వైభవ్ సూర్యవంశీ వికెట్ తర్వాత పాక్ ఆటగాళ్లు కవ్వించడంతో గొడవ జరిగింది. అభిషేక్ శర్మ జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. పూర్తి వివరాలు చూడండి. దోహా వేదికగా 314 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది ఇక్కడ.

Video: వైభవ్ ఔటయ్యాక చుట్టుముట్టి పాక్ ప్లేయర్ల రచ్చ.. ఆ తర్వాత అభిషేక్ ఏం చేశాడంటే?
Ind Vs Pak Vaibhav Sooryavanshi Wicket
Venkata Chari
|

Updated on: Nov 22, 2026 | 9:02 PM

Share

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ మరోసారి హీట్ పెంచింది. దోహా వేదికగా జరిగిన 8వ మ్యాచ్‌లో ఇండియా A, పాకిస్తాన్ A జట్లు తలపడ్డాయి. 314 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియాకు ఆరంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ చౌకగా ఔటయ్యాడు.

13 బంతుల్లో కేవలం 11 పరుగులు చేసి 15 ఏళ్ల యువ ఓపెనర్ పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్ A జట్టుకు కీలకమైన పెద్ద వికెట్ దక్కింది. అయితే అతడు ఔటైన తర్వాత మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఔట్ తర్వాత వైభవ్‌ను కవ్వించిన పాక్ ఆటగాళ్లు..

వైభవ్ సూర్యవంశీ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తుండగా పాకిస్తాన్ A ఆటగాళ్లు అతడిని కవ్వించినట్లు కనిపించింది. యువ భారత ఓపెనర్‌ను ఉద్దేశించి ఎగతాళిగా మాట్లాడటంతో ఇరువైపులా వాదన మొదలైంది. వైభవ్ కూడా ఘాటుగా బదులివ్వడంతో పరిస్థితి వేడెక్కింది.

వీడియోలో చూస్తే పాక్ ఫీల్డర్లు గుమిగూడి వైభవ్ చుట్టూ మాటల దాడి చేసినట్లు అర్థమవుతోంది. దీంతో మైదానంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్-పాక్ మ్యాచ్ అంటేనే సహజంగా ఉండే ఒత్తిడికి ఈ ఘటన మరింత ఆజ్యం పోసింది.

అభిషేక్ శర్మ ఎంట్రీతో సద్దుమణిగిన గొడవ

గొడవ ముదురుతుండటంతో సీనియర్ భారత బ్యాటర్ అభిషేక్ శర్మ రంగంలోకి దిగాడు. వైభవ్ వెనుకే వచ్చిన అభిషేక్.. పాక్ ఆటగాళ్ల వైపు వెళ్లి వారిని నిలదీసినట్లు కనిపించింది. కొందరు పాక్ ఆటగాళ్లు అభిషేక్ వైపు కూడా దూసుకురావడంతో పరిస్థితి మరింత తీవ్రమయ్యేలా కనిపించింది.

అయితే అంపైర్లు, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో వివాదం పెద్దది కాకుండా సద్దుమణిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైభవ్ వంటి చిన్న వయసు ఆటగాడిని పాక్ ఆటగాళ్లు కవ్వించడంపై భారత అభిమానులు మండిపడుతున్నారు.

314 పరుగుల ఛేదనలో ముందే వికెట్ కోల్పోయిన ఇండియా A జట్టు ఒత్తిడిలో పడింది. మ్యాచ్ ఫలితం ఏదైనా.. ఈ వాగ్వాదం ఘటన మాత్రం టోర్నమెంట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Follow Us
వైభవ్ ఔటయ్యాక పాక్ ప్లేయర్ల రచ్చ.. అభిషేక్ ఏం చేశాడంటే?
వైభవ్ ఔటయ్యాక పాక్ ప్లేయర్ల రచ్చ.. అభిషేక్ ఏం చేశాడంటే?
రాత్రిపూట బొప్పాయి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
రాత్రిపూట బొప్పాయి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
మీ దగ్గర రూ.10 లక్షలు ఉన్నాయా? నెలకు రూ.35 వేలు సంపాదించాలంటే ఎలా
మీ దగ్గర రూ.10 లక్షలు ఉన్నాయా? నెలకు రూ.35 వేలు సంపాదించాలంటే ఎలా
హైదరాబాద్‌లో ఉత్సాహభరితంగా నషా ముక్త్ భారత్ సైక్లింగ్ ర్యాలీ
హైదరాబాద్‌లో ఉత్సాహభరితంగా నషా ముక్త్ భారత్ సైక్లింగ్ ర్యాలీ
ఖరీదైన బట్టలు అవసరం లేదు.. ఆఫీసులో హుందాగా కనిపించాలంటే ఇవి చాలు
ఖరీదైన బట్టలు అవసరం లేదు.. ఆఫీసులో హుందాగా కనిపించాలంటే ఇవి చాలు
వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు.. చరిత్రను తిరగరాసిన జంషెడ్ ఆలం
వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు.. చరిత్రను తిరగరాసిన జంషెడ్ ఆలం
కారులో CNG కిట్ పెట్టిస్తున్నారా? ఈ తప్పు చేస్తే పేలుడు ప్రమాదం
కారులో CNG కిట్ పెట్టిస్తున్నారా? ఈ తప్పు చేస్తే పేలుడు ప్రమాదం
ప్రతి రోజూ ఉదయాన్నే 2 స్పూన్లు తింటే చాలు.. 60ల్లోనూ బాడీ ఉక్కులా
ప్రతి రోజూ ఉదయాన్నే 2 స్పూన్లు తింటే చాలు.. 60ల్లోనూ బాడీ ఉక్కులా
రాగి పిండితో కరకరలాడే కట్లెట్స్.. సాయంత్రం టీతో తింటే అదిరిపోద్ది
రాగి పిండితో కరకరలాడే కట్లెట్స్.. సాయంత్రం టీతో తింటే అదిరిపోద్ది
ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ఛాన్స్.. వీరికి ఈ వారం పట్టింది బంగారమే
ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ఛాన్స్.. వీరికి ఈ వారం పట్టింది బంగారమే