భారత నౌకాదళంలో మరో మైలురాయి.. మజ్‌గావ్‌ డాక్‌ ద్వారా జలప్రవేశం చేసిన వాగిర్‌ జలాంతర్గామి

|

Nov 13, 2020 | 3:33 PM

భారత నౌకాదళానికి సేవలు అందించేందుకు వాగిర్‌ జలాంతర్గామి వడివడిగా అడుగులేస్తోంది. ప్రాజెక్ట్‌ 75లో భాగంగా రూపొందించిన ఐదో స్కార్పీన్‌ తరగతి జలాంతర్గామి జల ప్రవేశం చేసింది.

భారత నౌకాదళంలో మరో మైలురాయి..  మజ్‌గావ్‌ డాక్‌ ద్వారా జలప్రవేశం చేసిన వాగిర్‌ జలాంతర్గామి
Follow us on

భారత నౌకాదళానికి సేవలు అందించేందుకు వాగిర్‌ జలాంతర్గామి వడివడిగా అడుగులేస్తోంది. ప్రాజెక్ట్‌ 75లో భాగంగా రూపొందించిన ఐదో స్కార్పీన్‌ తరగతి జలాంతర్గామి జల ప్రవేశం చేసింది. రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్‌ సతీమణి విజయ ముంబయిలోని మజ్‌గావ్‌ డాక్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వీడియో సమావేశం విధానంలో దీనిని అరేబియా సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టారు. శత్రు దేశాల క్షిపణులు, జలాంతర్గాముల కళ్లుగప్పే స్టెల్త్‌ సాంకేతిక పరిజ్ఞానంతో వాగిర్‌ రూపొందడం విశేషం.

స్కార్పీన్‌ క్లాస్‌ వాగిర్‌ జలాంతర్గామి మజగాన్‌ డాక్‌ వద్ద జలప్రవేశం చేసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో నిర్మిస్తున్న ఆరు కల్వరీ క్లాస్‌ జలాంతర్గాముల్లో ఐఎన్‌ఎస్‌ వాగిర్‌ ఐదోది. ఫ్రెంచ్‌ నావికాదళ రక్షణ, ఇంధన సంస్థ డీసీఎన్‌ఎస్‌ రూపొందించిన జలంతార్గములను భారత నేవీ ఫోర్స్ ప్రాజెక్ట్‌ 75లో భాగంగా ముంబైలోని మజగాన్‌ డాక్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) నిర్మిస్తోంది. ఆరు స్కార్పీన్‌ క్లాస్ జలాంతర్గాముల్లోని మొదటిదైన ఐఎన్ఎస్ కల్వరిని 2017 డిసెంబర్‌లో భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఇది డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ జలాంతర్గామి. 2017లో ప్రవేశపెట్టిన ఐఎన్ఎస్ ఖండేరి రెండవది కాగా.. మూడోది ఐఎన్ఎస్ కరంజ్ 2018 నేవీ దళంలో చేరింది. ఇక, నాల్గోది ఐఎన్‌ఎస్‌ వెలా 2019 నుంచి సేవలందిస్తుంది. స్కార్పీన్ జలాంతర్గాములు అనేక రకాలైన మిషన్లను చేపట్టగలవు. యాంటీ సర్ఫేస్ వార్‌ఫేర్‌, యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌, ఇంటెలిజెన్స్ సేకరణ, మైన్‌ లేయింగ్‌, తీర ప్రాంతాల్లో నిఘా తదితర మిషన్లు చేపట్టవచ్చని నావికాదళ అధికారులు తెలిపారు.