AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చూపులేని తల్లి.. కదలలేని తండ్రి.. 600 కిలోమీటర్లు.. ట్రైసైకిల్ పై సొంతూరు చేర్చిన 11ఏళ్ల కుర్రాడు

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ జనం చేత వింత వింత ఫిట్స్ చేయిస్తోంది. కొందరిలో కనిపించని శక్తిని బయటకు తీస్తోంది. ఇటీవల 15 ఏళ్ల జ్యోతి కుమారి తన గాయపడ్డ తండ్రిని 1,200 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కి ఇంటికి సురక్షితం చేర్చింది. జ్యోతి ధైర్యాన్ని మరవక ముందే తాజాగా, 11ఏళ్ల బాలుడు 600 కిలోమీటర్లు ట్రై సైకిల్ తొక్కి తన తల్లిదండ్రుల్ని సురక్షితంగా ఇంటికి చేర్చాడు. బీహార్ ఆరియారియాకు చెందిన దంపతులు ఉత్తర ప్రదేశ్ వారణాసి […]

చూపులేని తల్లి.. కదలలేని తండ్రి.. 600 కిలోమీటర్లు.. ట్రైసైకిల్ పై సొంతూరు చేర్చిన 11ఏళ్ల కుర్రాడు
Balaraju Goud
|

Updated on: May 26, 2020 | 6:07 PM

Share

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ జనం చేత వింత వింత ఫిట్స్ చేయిస్తోంది. కొందరిలో కనిపించని శక్తిని బయటకు తీస్తోంది. ఇటీవల 15 ఏళ్ల జ్యోతి కుమారి తన గాయపడ్డ తండ్రిని 1,200 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కి ఇంటికి సురక్షితం చేర్చింది. జ్యోతి ధైర్యాన్ని మరవక ముందే తాజాగా, 11ఏళ్ల బాలుడు 600 కిలోమీటర్లు ట్రై సైకిల్ తొక్కి తన తల్లిదండ్రుల్ని సురక్షితంగా ఇంటికి చేర్చాడు. బీహార్ ఆరియారియాకు చెందిన దంపతులు ఉత్తర ప్రదేశ్ వారణాసి లో నివసిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా యూపీ నుంచి బీహార్ కు రావాల్సి ఉంది. గాయం కారణంగా కంటి చూపును కోల్పోయిన తల్లిని, మార్బల్ కంపెనీలో పనిచేస్తూ గాయపడ్డ తండ్రిని 11ఏళ్ల బాలుడు తబారక్ స్వగ్రామానికి తరలించాడు. యూపీ నుంచి బీహార్ కు 600కిలోమీటర్లు ట్రై సైకిల్ తొక్కుతూ తల్లిదండ్రుల్ని బాలుడు సురక్షితంగా తీసుకువచ్చినట్లు మీడియా సంస్థ దివైర్ కథనాన్ని ప్రచురించింది. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కొల్పోయారు. కడుపు నింపుకునేందుకు ఇబ్బంది పడ్డారు. కనీసం సొంతూరుకైనా చేరాలని భావించారు. వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వెళ్లేందుకు మార్గం వెతుకున్నారు. ఇంతలో తమ 11 ఏళ్ల కొడుకు తబారక్ ట్రై సైకిల్ తో సొంతూరుకు వెళ్దామని చెప్పడంతో కాస్త భయపడ్డా.. ప్రయాణం సాగించారు. రహదారి మార్గంలో ప్రజలు అండగా నిలిచారు. భోజన సదుపాయం కల్పించారు. 11ఏళ్ల తన కుమారుడైన తబారక్ తమని ఇంటికి తీసుకువచ్చాడని గర్వంగా చెప్పాడు తండ్రి. ప్రస్తుతం బాలుడి కుటుంబాన్ని జిల్లా అధికారులు క్వారంటైన్ లో ఉంచారు.

టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు
రూ.లక్షన్నర జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్‌ ఉద్యోగాలు
ఎర్ర అరటి తింటే అందే ప్రయోజనాలు తెలుసా..?
ఎర్ర అరటి తింటే అందే ప్రయోజనాలు తెలుసా..?
సుదీర్ఘ న్యాయ పోరాటానికి విషాదకరమైన ముగింపు..!
సుదీర్ఘ న్యాయ పోరాటానికి విషాదకరమైన ముగింపు..!