Muslim Man Thrashed: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక వృద్ధ ముస్లింను కొందరు వ్యక్తులు అత్యంత దారుణంగా హింసించారు. ‘జై శ్రీ రామ్’ నినాదం చెప్పాలంటూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన జూన్ 5వ తేదీన జరుగగా.. తాజాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవడంతో వెలుగు చూసింది. వివరాల్లోకెళితే.. ఘజియాబాద్ జిల్లాకు చెందిన అబ్దుల్ సమద్‌ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అతనిపై దాడి చేశారు. ‘జై శ్రీరామ్’, ‘వందేమాత్రం’ నినాదాలు చేయాలని అతన్ని బలవంతం పెట్టారు. కత్తిని చూపెడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాదు.. అతని గడ్డాన్ని కత్తిరించారు.
అనంతరం తాము చెప్పినట్లు నినదించకపోతే.. ఇదే గతి పడుతుందంటూ గతంలో పలువురు ముస్లింలపై జరిపిన దాడుల తాలూకు వీడియోను బాధితుడికి చూపించారు. ఇదిలాఉంటే.. సమద్ పాకిస్తాన్ గూఢాచారి అని అతన్ని కిడ్నాప్ చేసిన దుండగులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడైన ప్రవీష్ గుజ్జర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో పాల్గొన్న ఇతర వ్యక్తులను పట్టుకునేందుకు గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
తాను ఎదుర్కొన్న భయానక ఘటనకు సంబంధించి వివరాలను అబ్దుల్ సమద్ వెళ్లడించాడు. ‘‘ఆటోలో వస్తుండగా.. మరో ఇద్దరు వ్యక్తులు ఆటో లోపలికి వచ్చారు. నన్ను బంధించారు. అలా వారు నన్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ బంధించి కొట్టారు. ‘జై శ్రీరామ్, వందేమాతరం’ నినాదం చెప్పాలని డిమాండ్ చేశారు. నా ఫోన్ లాక్కున్నారు. వాచ్ ను ధ్వంసం చేశారు. నా గడ్డాన్ని కత్తిరించారు.’’ అని కన్నీళ్లు పెట్టుకుంటూ సమద్ చెప్పుకొచ్చాడు.
ఇదిలాఉంటే.. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో విడుదల చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మరికొందరి కోసం గాలిస్తున్నారు.
Twitter Video:
An elderly Man, Sufi Abdul Samad Saifi was attacked by five goons in Loni, Ghaziabad. He was threatened at the gun point, beaten, assaulted and they forcefully chopped off his beard. @ghaziabadpolice @Uppolice pic.twitter.com/0QphDcnKUN
— Mohammed Zubair (@zoo_bear) June 14, 2021
Also read:
కోవిద్ వ్యాక్సిన్ తీసుకున్న మరో వ్యక్తికి ‘మాగ్నెటిక్ పవర్స్’….కొట్టి పారేసిన కేంద్రం