మేమూ ఆ యాప్ ని నిషేధించే యోచనలో ఉన్నాం.. అమెరికా

టిక్ టాక్ సహా చైనాకు చెందిన 58 యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో అమెరికా కూడా దీనిపై దృష్టి పెటింది. అమెరికన్ల వ్యక్తిగత సమాచారం చైనా కమ్యూనిస్టు పార్టీ చేతుల్లోకి వెళ్లాలనుకుంటే..

మేమూ ఆ యాప్ ని నిషేధించే యోచనలో ఉన్నాం.. అమెరికా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 07, 2020 | 10:36 AM

టిక్ టాక్ సహా చైనాకు చెందిన 58 యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో అమెరికా కూడా దీనిపై దృష్టి పెటింది. అమెరికన్ల వ్యక్తిగత సమాచారం చైనా కమ్యూనిస్టు పార్టీ చేతుల్లోకి వెళ్లాలనుకుంటే వాళ్ళు టిక్ టాక్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని  ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో  వ్యంగ్యంగా అన్నారు. అమెరికా, చైనా దేశాల మధ్య సెక్యూరిటీ, వాణిజ్యం, టెక్నాలజీ వంటి వాటితో సహా వివిధ రంగాల్లో తీవ్ర విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా చైనాకు సంబంధించి వాణిజ్య టారిఫ్ విషయంలో అమెరికా ఆ దేశంతో విభేదిస్తోంది.

టిక్ టాక్ దేశ భద్రతకు ముప్పు అని అమెరికాలోని పలువురు ఎంపీలు భావిస్తున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ అజమాయిషీలో ఉన్న బైట్ డాన్స్ సంస్థ ఆ దేశ ఇంటెలిజెన్స్ ఆదేశాలకు లోబడి పని చేయవలసి ఉంటుందని వారు చెబుతున్నారు. అందువల్ల ఆ నెట్ వర్క్ ఒత్తిడి ఆ సంస్థపై ఉండడం సహజమే అని వారు పేర్కొంటున్నారు. టిక్ టాక్ సహా పలు యాప్ లను  బైట్ డాన్స్ నిర్వహిస్తోంది. అటు-ముఖ్యంగా టిక్ టాక్ పై భారత ప్రభుత్వం విధించిన బ్యాన్ కారణంగా ఈ సంస్థకు సుమారు 6 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని అంచనా.. మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటివరకు చైనా యాప్ లపై బ్యాన్ గురించి యోచించనప్పటికీ.. బహుశా ప్రభుత్వ ప్రతిపాదనను దృష్టిలో ఉంచుకునే మైక్ పాంపియో ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు.

వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!