అమెరికా ఎన్నికలు, టెక్సాస్ లో రిపబ్లికన్ల ‘కుట్ర’ను వమ్ము చేసిన జడ్జి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సైతం కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. ఇందుకు ఉదాహరణ టెక్సాస్ లో జరిగిన  ఓ ఉదంతమే !

అమెరికా ఎన్నికలు, టెక్సాస్ లో రిపబ్లికన్ల 'కుట్ర'ను వమ్ము చేసిన జడ్జి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 03, 2020 | 11:45 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సైతం కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. ఇందుకు ఉదాహరణ టెక్సాస్ లో జరిగిన  ఓ ఉదంతమే ! ఇక్కడ ఇదివరకే పోలైన ఓట్లను గోల్ మాల్ చేసేందుకు యత్నించిన రిపబ్లికన్ల కుట్రను జడ్జి ఎండ్రు  హానెన్ వమ్ము చేశారు. ఈ కరోనా పాండమిక్ నేపథ్యంలో హారిస్ కౌంటీ క్లర్క్ క్రిస్ హాలిన్స్ ని డ్రైవ్ త్రూ ఓటింగ్ ద్వారా పోలింగ్ సైట్స్ లోకి అనుమతించారని మొదట ప్రతివాదులు ఆరోపించారు. దీంతో విచారించిన ఈ జడ్జి వెంటనే ఆ ఓట్లు చెల్లబోవని రిజెక్ట్ చేస్తూ ఉత్తర్వులిచ్చా రు. టెక్సాస్ చట్టాల  ప్రకారం డ్రైవ్ త్రూ ఎర్లీ ఓటింగ్ కి అనుమతించవచ్చునని .కానీ ఈ సందర్భంలో మాత్రం ఈ చట్టాల ఉల్లంఘన జరిగిందని ,  ఆ న్యాయమూర్తి పేర్కొన్నారు. టెక్సాస్ లో ఏనాటి నుంచో రిపబ్లికన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం వారికి డెమొక్రాట్లు గట్టి పోటీనిస్తున్నారు.