మైగ్రెంట్ల అప్పగింతపై జో బైడెన్ వంద రోజుల నిలుపుదల ఉత్తర్వు, చెక్ పెట్టిన ఫెడరల్ జడ్జి
ఇతర దేశాల నుంచి తమ దేశంలో ప్రవేశించే మైగ్రెంట్ల అప్పగింతపై 100 రోజుల బ్యాన్ విధిస్తు బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయకుండా..
US President Joe Biden: ఇతర దేశాల నుంచి తమ దేశంలో ప్రవేశించే మైగ్రెంట్ల అప్పగింతపై 100 రోజుల బ్యాన్ విధిస్తు బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయకుండా యూఎస్ ఫెడరల్ జడ్జి నిలిపివేశారు. ఈ కేసును మరింత కూలంకషంగా పరిశీలించేందుకు 14 రోజుల తాత్కాలిక ఉత్తర్వును న్యాయమూర్తి డ్రు టిప్టన్ జారీ చేఅయారు. గత ఏడాది నవంబరు 1 కి ముందు ఎలాంటి పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశించిన వీరి తరలింపు లేదా అప్పగింతపై బైడెన్ ప్రభుత్వం ఓ మారటోరియం మీద సంతకం చేసింది. అయితే ఈ ఉత్తర్వును మాజీ అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడైన అటార్నీ జనరల్ పాక్స్టన్ సవాలు చేస్తూ కోర్టు కెక్కారు. కోర్టు తాత్కాలికంగా ఇఛ్చిన ఉత్తర్వు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.