యూఎస్ చరిత్రలో తొలి శకం.. బైడెన్ తరుపున ఒబామా ప్రచారం

అమెరికా రాజకీయ చరిత్రలో కొత్త అధ్యయనం మొదలైంది. మాజీ దేశాధ్యక్షులు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం ఇదే తొలిసారి.

యూఎస్ చరిత్రలో తొలి శకం.. బైడెన్ తరుపున ఒబామా ప్రచారం
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 17, 2020 | 1:20 PM

అమెరికా రాజకీయ చరిత్రలో కొత్త అధ్యయనం మొదలైంది. మాజీ దేశాధ్యక్షులు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షడు జో బైడెన్, ఉపాధ్యక్ష అభ్యర్థి, ఇండో-అమెరికన్ సెనేటర్ కమలా హ్యారిస్ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. వచ్చేవారం పెన్సిల్వేనియాలో జరిగే ఎన్నికల ర్యాలీలో ఒబామా పాల్గొని ప్రసంగిస్తారని బైడెన్ క్యాంపెయిన్ శుక్రవారం వెల్లడించింది. కాగా, ఒబామా అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రెండు పర్యాయాలు బైడెన్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, ఒక మాజీ ఉపాధ్యక్షుడు ఇలా నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అమెరికా రాజకీయ చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఇంతకుముందు మాజీలు ఆన్‌లైన్ వేదికలపై సొంత పార్టీలకు మద్దతు తెలపడం, ప్రచారం నిర్వహించారు తప్ప ప్రత్యక్ష వేదిక ద్వారా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. ఇక ఒబామా అధ్యక్ష పదవి కాలం ముగిసి నాలుగేళ్లు గడిచిన తన వక్తృత్వ నైపుణ్యాల కారణంగా ఇప్పటికీ ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీకి అతిపెద్ద క్రౌడ్ పుల్లర్‌ ఆయనే కావడం విశేషం.

“అక్టోబర్ 21 బుధవారం రోజు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో జరిగే ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొంటారు. అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ తరఫున ప్రచారం నిర్వహిస్తారు” అని శుక్రవారం మధ్యాహ్నం బైడెన్ ఎన్నికల బృందం ప్రకటించింది. ఇక తాజా వెలువడిన ఒపినియన్ పోల్ ఫలితాల్లో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ సుమారు 10 పాయింట్లతో ముందజలో ఉన్నట్లు తేలింది. బైడెన్‌కు 53.8 శాతం ఓటర్లు మద్దతు పలుకుతుండగా… అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైపు కేవలం 43.5 శాతం ఓటర్లు మాత్రమే మొగ్గుచూపుతున్నట్లు వెల్లడైంది.

కాగా, ప్రస్తుత సర్వే ఫలితాల ఆధారంగా అమెరికాలోని మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో బైడెన్‌కు 334 ఓట్లు వస్తే… ట్రంప్ 126 ఓట్లు గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో అధ్యక్ష పదవి చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 270 కంటే అధిక ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు బైడెన్‌కు లభిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు బైడెన్ విజయం నల్లేరు మీద నడకేనని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.