ఎంఆర్ కాలేజ్ ప్రైవేటీకరణపై రంగంలోకి ఊర్మిళ గజపతిరాజు

ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణ అంశంలోకి ఇప్పుడు ఆనంద గజపతిరాజు మరో కుమార్తె ఊర్మిళ గజపతిరాజు వచ్చారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఎంఆర్ కాలేజ్ ను ప్రయివేటు పరం చేయడం తగదని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. కొందరు తన తాత, తండ్రి పేరు, ప్రతిష్ఠలు చెడగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కళాశాలను ప్రైవేటీకరించాలని పూనుకోవడం బాధాకరమని, ఈ కాలేజిలో చదువుకున్న వారు దేశవిదేశాల్లో మెరుగైన స్థానాల్లో ఉన్నారని తెలిపారు. ఘనచరిత్ర ఉన్న కాలేజిని ప్రైవేటు […]

ఎంఆర్ కాలేజ్ ప్రైవేటీకరణపై రంగంలోకి ఊర్మిళ గజపతిరాజు

Updated on: Oct 06, 2020 | 6:27 PM

ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణ అంశంలోకి ఇప్పుడు ఆనంద గజపతిరాజు మరో కుమార్తె ఊర్మిళ గజపతిరాజు వచ్చారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఎంఆర్ కాలేజ్ ను ప్రయివేటు పరం చేయడం తగదని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. కొందరు తన తాత, తండ్రి పేరు, ప్రతిష్ఠలు చెడగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కళాశాలను ప్రైవేటీకరించాలని పూనుకోవడం బాధాకరమని, ఈ కాలేజిలో చదువుకున్న వారు దేశవిదేశాల్లో మెరుగైన స్థానాల్లో ఉన్నారని తెలిపారు. ఘనచరిత్ర ఉన్న కాలేజిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తామంటే తాము అంగీకరించబోమని ఊర్మిళ గజపతిరాజు తేల్చిచెప్పారు.

అయితే, మాన్సాస్ ట్రస్ వ్యవహారంలోని అన్ని అంశాల్లోకీ ప్రభుత్వాన్ని లాగడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కొంతకాలంగా విజయనగరం పూసపాటి గజపతిరాజుల కుటుంబ వ్యవహారాలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజు బాధ్యతలు చేపట్టడం మొదలు ట్రస్ట్ లోని లోటుపాట్లు బయటపడుతున్నాయి .